Saturday, November 15, 2025
Homeబిజినెస్E-commerce: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ఇవి తప్పనిసరి..!

E-commerce: కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ఇవి తప్పనిసరి..!

New Delhi: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత దేశంలో విక్రయించబడే ప్రతి వస్తువుపై ఖచ్చితంగా గరిష్ఠ ధర(ఎంఆర్పీ), తయారీ దేశం, తయారీ తేదీ, గడువు తేదీ వంటి సమాచారం చూపించాలి. ఇది అన్ని వర్తక విధానాలలో వర్తిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ లకు కూడా మినహాయింపు లేదు. వినియోగదారుల హక్కులను రక్షించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్లలో కొన్ని మాత్రమే ‘తయారీ దేశం’ వంటి వివరాలను ఉత్పత్తి వివరణలో చూపిస్తున్నాయి. అది కూడా వినియోగదారుడు స్వయంగా స్క్రోల్ చేసి చూసే విధంగా ఉంటుంది. దీంతో సరైన సమాచారం లేకుండా అనేకమంది ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇది వినియోగదారుల సమాచార హక్కుకు భంగం కలిగిస్తుంది.

Read more: https://teluguprabha.net/news/airtel-rs-249-prepaid-plan-removed-2025/

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ నిబంధనల గురించి ప్రస్తావించారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.5000 జరిమానా ఉంటుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కి మద్దతు ఇవ్వడంతో పాటు స్మార్ట్ షాపింగ్ ని ప్రోత్సహించడం లక్ష్యం అని మంత్రి అన్నారు. వస్తువు తయారి తేదీ, గడువు తేదీ, తయారీ దేశం వంటి వివరాలు చూసేందుకు ఈ-కామర్స్ సైట్ లో ప్రత్యేక ఫిల్టర్స్ ని ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఈ చర్యలతో భారతీయ ఉత్పత్తులకు ఆదరణ పెరిగే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఉత్పత్తులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. దేశీయ తయారీదారులకు ఇది ఊపిరిగా మారుతుంది. ఇకపోతే వినియోగదారులకు పూర్తి సమాచారం లభించడంతో వారు అవగాహనతో కూడిన కొనుగోళ్లను చేయగలుగుతారు.

Read more: https://teluguprabha.net/business/gst-reforms-india-2025-modi-diwali-gift-price-cuts/

ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిన తర్వాత, అమలు కోసం మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ విడుదల చేయనుంది. ఈ మార్గదర్శకాలు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ అమ్మకందారులకు విధిగా అమలు చేయాల్సిన నిబంధనలను సూచించనున్నాయి.

ఈ కొత్త నిబంధనలతో వినియోగదారుల హక్కులు బలోపేతం అవుతాయి. అలాగే దేశీయ తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం కూడా లభిస్తుంది. సరైన సమాచారం అందుబాటులో ఉంటే వినియోగదారుడు స్వేచ్ఛగా, తెలివిగా కొనుగోలు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇది వ్యాపార రంగంలో సరైన పోటీ వాతావరణాన్ని కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad