Maruti Baleno discount: ఓవైపు పండుగ ఆఫర్లు మరోవైపు జీఎస్టీ తగ్గింపుతో దేశంలో ఎక్కడ చూసినా కొనుగోళ్ల హవా నడుస్తోంది. కార్ల షోరూంలు కలకళలాడుతున్నాయి. దసరా, దీపావళి దగ్గరపడుతున్న వేళ జీఎస్టీ రేట్ల తగ్గింపు రావటంతో షోరూంలు దేశవ్యాప్తంగా కస్టమర్లతో కిక్కిరిసిపోతున్నాయి. మధ్యతరగతి కూడా తమ స్థాయికి తగిన కార్లను కొనుక్కుంటున్నారు. ముందుగా రేట్లు తగ్గటంతో పాటు మరోపక్క బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు ఈఎంఐ ఆఫర్లు ప్రకటించటంతో ఇదే లక్కీ ఛాన్స్ అని భావిస్తున్న లక్షల మంది షాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ సైతం కార్లు తీసుకునేందుకు కస్టమర్లు పోటీపడుతున్నారు. భారత్‌లో మారుతీ సుజుకీ పాపులర్ కారుగా పేరొందిన ప్యాసింజర్ ప్రీమియం హ్యాచ్ మోడల్ బ్యాలినో రేటు రూ.6 లక్షలకు తగ్గింది. దీని స్టాండర్డ్ మోడల్ రేటు ఇప్పడు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరలోకి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. వాస్తవానికి గతంలో వీటిపై 28 శాతం జీఎస్టీతో పాటు సెజ్ 1 శాతం నుంచి 3 శాతం వరకు అదనంగా ఉండేది. దీంతో పన్నులకే 31 శాతం వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పన్ను ఈ మోడళ్లపై 18 శాతానికి తగ్గటంతో భారతీయులు అమితంగా ప్రేమించే బ్యాలినో రేట్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయని కంపెనీ ప్రకటించింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/nara-lokesh-on-sku/
ఏకంగా రూ. 86 వేలు తగ్గిన ధర..
బాలినో ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5,98,900 వద్ద ఉంది. అంటే ఇదే క్రమంలో హ్యుందాయ్ ఐ20 రూ.6,86,865గా ఉండగా, టాటా ఆల్ట్రోజ్ రూ.6, 30,390 వద్ద అందుబాటులో ఉంది. మరోవైపు, టయోటా గ్లాన్జా రూ.6,39,300 వద్ద లభిస్తోంది. దేశంలో జీఎస్టీ రేట్ల తగ్గింపుతో మారుతీ తన బ్యాలినో మోడల్ రేటును ఏకంగా రూ.86 వేలకు పైగా తగ్గించింది. ప్రస్తుతం ఇది దేశంలో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో కొనసాగుతోంది. అమ్మకాల పరంగా ఏడో స్థానంలో ఉన్న ఈ హ్యాచ్ బ్యాక్‌కు భారత్‌లో విపరీతమైన డిమాండ్ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. పైగా సేఫ్టీ విషయంలోనూ ఇది బెస్ట్ కారుగా నిలిచింది. సేఫ్టీ విషయానికి వస్తే బాలినో 4 స్టార్ రేటింగ్ అందుకుంది. భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో బాలినో దుమ్మురేపింది. దీంతో, తక్కువ ధరలో లభించే ఈ కారును కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా, బాలినో వేరియంట్ ప్రస్తుతం రూ.6 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల మధ్య విక్రయించబడుతోంది. ఆయా మోడళ్లలోని ఫీచర్ల ఆధారంగా ధరను నిర్ణయించి అమ్మకాలు చేస్తుంది.


