Saturday, November 15, 2025
HomeTop StoriesMaruti Suzuki: మార్కెట్‌లో అగ్రగామిగా మారుతి కార్లు.. సెప్టెంబర్‌లో ఏ మోడల్‌ ఎన్ని అమ్ముడయ్యాయో తెలుసా?

Maruti Suzuki: మార్కెట్‌లో అగ్రగామిగా మారుతి కార్లు.. సెప్టెంబర్‌లో ఏ మోడల్‌ ఎన్ని అమ్ముడయ్యాయో తెలుసా?

Maruti Suzuki Top Sale Cars In India: జీఎస్టీ తగ్గింపుతో ఆటోమొబైల్‌ రంగం శరవేగంగా అభివృద్ది చెందుతోంది. తక్కువ ధరకే కార్లను విక్రయిస్తుండటంతో వాహన ప్రియులు తమకు నచ్చిన కారును కొనేస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు బెస్ట్‌ బ్రాండ్‌గా నిలిచిన మారుతి సుజుకి కార్లు హాట్‌ కేకుల్లా అమ్మువడవుతున్నాయి. ఈ ఏడాది భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మోడళ్లలో మారుతి సుజుకి టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. దసరా పండుగ సీజన్‌ సెప్టెంబర్ నెలలో అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో మారుతీ సుజికీ కంపెనీ తన ఆధిపత్యాన్ని చూపింది. అత్యధికంగా మారుతి సుజికి కారు మోడళ్లు అమ్ముడయ్యాయి. వీటిలో మారుతి డిజైర్, మారుతి స్విఫ్ట్, మారుతి వ్యాగన్ఆర్, మారుతి ఫ్రాంక్స్, మారుతి బాలెనో, మారుతి ఎర్టిగా వంటి కారు మోడళ్లు ఉన్నాయి. అయితే, జీఎస్టీ తగ్గినప్పటికీ.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్‌ సీజన్‌లో కొన్ని కారు మోడళ్ల అమ్మకాలు సైతం తగ్గాయి. వాటిపై ఓలుక్కేద్దాం.

- Advertisement -

స్విఫ్ట్‌ డిజైర్‌కు ఫుల్‌ డిమాండ్‌..

టాప్-10 కార్ల జాబితాలో మారుతి స్విఫ్ట్‌ డిజైర్ రెండవ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 2025లో ఈ మోడల్‌ 20,038 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే మోడల్‌ సెప్టెంబర్ 2024లో 10,853 యూనిట్ల వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇక, మారుతి స్విఫ్ట్‌ ఆరో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 2025లో మారుతి స్విఫ్ట్‌ కార్లు 15,547 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే, సెప్టెంబర్ 2024లో అమ్ముడైన 16,241 యూనిట్లతో పోలిస్తే 4 శాతం క్షీణత నమోదు చేసింది. ఇక, అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి వ్యాగన్ఆర్ 7వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 2025లో 15,388 యూనిట్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ 2024లో అమ్ముడైన 13,339 యూనిట్లతో పోలిస్తే.. 15 శాతం అమ్మకాలు తగ్గాయి. మారుతి ఫ్రాంక్స్ 8వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 2025లో, 13,767 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది సెప్టెంబర్ 2024లో అమ్ముడైన 13,874 యూనిట్లతో పోలిస్తే.. 1శాతం వార్షిక క్షీణత నమోదు చేసింది. ఆ తర్వాత స్థానంలో మారుతి బాలెనో నిలిచింది. ఈ కారు అమ్మకాల్లో 9వ స్థానం దక్కించుకుంది. సెప్టెంబర్ 2024లో అమ్ముడైన 14,292 యూనిట్లతో పోలిస్తే 13,173 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే వార్షిక క్షీణత 8 శాతం నమోదైంది. మారుతి ఎర్టిగా 10వ స్థానంలో నిలవగా.. సెప్టెంబర్ 2025లో ఈ మోడల్‌ 12,115 అమ్ముడయ్యాయి. ఇదే మోడల్‌ సెప్టెంబర్ 2024లో 17,441 యూనిట్లు నమోదు చేసింది. ఇది 31 శాతం వార్షిక క్షీణతను కనబర్చింది.

జీఎస్టీ తగ్గినా అమ్మకాలు పెరగలే..

మారుతి ఫేమస్ ఎస్‌యూవీ మారుతి బ్రెజ్జా, ఈకో వ్యాన్ సెప్టెంబర్‌లో టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మారుతి బ్రెజ్జా సెప్టెంబర్ 2025లో 10,173 యూనిట్లను విక్రయించగా.. సెప్టెంబర్ 2024లో 15,322 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, ఇది 34 శాతం వార్షిక క్షీణతను నమోదు చేసింది. సెప్టెంబర్ 2024లో 11,908 యూనిట్లతో పోలిస్తే మారుతి ఈకో సెప్టెంబర్ 2025లో 10,035 యూనిట్లను విక్రయించింది. ఇది 16 శాతం వార్షిక క్షీణతను నమోదు చేసింది. మరోవైపు, మారుతి గ్రాండ్ విటారా సెప్టెంబర్ 2025లో 5,698 యూనిట్లను విక్రయించింది. ఇది 2024 సెప్టెంబర్‌లో 10,267 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గతేడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 45 శాతం తగ్గినట్లుగా చెప్పవచ్చు. మారుతి ఆల్టో K10 సెప్టెంబర్ 2025లో 5,434 యూనిట్లను విక్రయించగా.. 2024 సెప్టెంబర్‌లో 8,655 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 37 శాతం క్షీణత నమోదు చేసింది. ఇక, మారుతి స్విఫ్ట్ డిజైర్ సెడాన్ గత కొన్ని నెలలుగా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ కార్డు అమ్మకాల్లో 2వ స్థానంలో నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad