Cars: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3, 2025 రాత్రి కొత్త GST శ్లాబ్‌ను ఆమోదించింది. దీని వలన కార్లపై పన్ను 28% నుండి 18%కి తగ్గుతుంది. కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి. దీని వల్ల వినియోగదారులకు నేరుగా లబ్ధి పొందుతారు. ఎందుకంటే కార్లు ఇప్పుడు మునుపటి కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో మారుతి వాగన్ఆర్ లేదా టాటా టియాగోను కొనుగోలు చేయాలనీ ఆలోచిస్తుంటే, జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ రెండు కార్లు ఎంత చౌకగా లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
జీఎస్టీ సంస్కరణలు 2.0 అమలు తర్వాత ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాగన్ఆర్ కారు ధరలను తగ్గించింది. కస్టమర్లు ఇప్పుడు ఈ కారు కొనుగోలుపై ఏకంగా రూ.64,000 వరకు ఆదా చేస్తారని కంపెనీ తెలిపింది. అయితే, ఈ తగ్గింపు ప్రతి వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది. మరోవైపు, టాటా మోటార్స్ తన ప్రసిద్ధ కారు టాటా టియాగో రూ.75,000 వరకు చౌకగా మారిందని ప్రకటించింది. ఇది కారును మరింత సరసమైన ఎంపికగా చేస్తుంది.
also read:Volkswagen Cars: ఈ వోక్స్‌వ్యాగన్ కార్లపై భారీ డిస్కౌంట్..ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్..
ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 67 bhp, 89 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. అలాగే, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 90 bhp, 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు, వ్యాగన్ఆర్ సిఎన్‌జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 34 km/kg వరకు ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు, టాటా టియాగో కారు గురించి మాట్లాడితే, ఇది సిఎన్‌జి లో అందుబాటులో ఉంది. టియాగో సిఎన్‌జి లోని ఇంజిన్ 6,000 rpm వద్ద 75.5 PS శక్తిని, 3,500 rpm వద్ద 96.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 242 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. ఇది 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ టాటా వాహనం ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.


