Mercedes Benz AMG CLE 53 Launched: భారతదేశంలో అనేక విభాగాలలో వాహనాలను విక్రయించే ప్రముఖ లగ్జరీ వాహన తయారీదారు మెర్సిడెస్ బెంజ్. కంపెనీ ఇటీవల కొత్త శక్తివంతమైన మెర్సిడెస్ భారతదేశంలో AMG CLE 53 ను కారును మార్కెట్లో విడుదల చేసింది.తయారీదారు ఈ కారులో అనేక గొప్ప ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ను అందించారు. ఇప్ప్పుడు ఈ కారులో ఎలాంటి ఫీచర్లు అందించారు? ఎంత ధరకు తీసుకొచ్చారో ఈ కధనం ద్వారా తెలుసుకుందాం.
ఈ కారులో తయారీదారు అనేక గొప్ప ఫీచర్లను అందించింది. ఇందులో 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్, 12.3 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మెమరీ పవర్డ్ సీట్లు, డ్యూయల్ డిజిటల్ డిస్ప్లే, ఆటో పార్కింగ్, హెడ్స్-అప్ డిస్ప్లే, బర్మెస్టర్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, LED లైట్లు, AMG స్టీరింగ్ వీల్, AMG స్పోర్ట్స్ ప్యాడిల్, 11.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 21 అంగుళాల అల్లాయ్ వీల్స్, AMG బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి.
also read:Yezdi Roadster: 2025 యెజ్డీ రోడ్‌స్టర్ లాంచ్..6-స్పీడ్ గేర్‌బాక్స్, 334cc సింగిల్-సిలిండర్!
మెర్సిడెస్ బెంజ్ మెర్సిడెస్ బెంజ్ AMG CLE 53 లో మూడు-లీటర్ ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ కారుకు 450 bhp శక్తిని, 560 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఇస్తుంది. ఇది AMG కోసం..ప్రత్యేకంగా తయారు చేయబడిన తొమ్మిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 4.2 సెకన్ల లో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 270 kmph వరకు ఉంటుంది.
భారతదేశంలో మెర్సిడెస్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ AMG CLE 53 ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.35 కోట్లుగా ఉంచింది. ఈ కారును CLE 300 క్యాబ్రియోలెట్ పైన ఉంచారు. దీని కోసం బుకింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయి.


