Saturday, November 15, 2025
Homeబిజినెస్Tax Filing: పన్ను రిటర్న్స్ ఫైలింగ్ మిస్ అయ్యారా..? డోన్ట్ వర్రీ ఈ 3 మార్గాలు...

Tax Filing: పన్ను రిటర్న్స్ ఫైలింగ్ మిస్ అయ్యారా..? డోన్ట్ వర్రీ ఈ 3 మార్గాలు వాడుకోండి..

Missed ITR Deadline: ఈ ఏడాది ఆదాయపన్ను రిటర్న్స్ ఫైలింగ్‌కి గడువు రెండు సార్లు పొడిగించబడింది. జూలైలో మొదటి గడువును సెప్టెంబర్ 15కు మార్చగా.. ఆ తర్వాత చివరిక్షణంలో దానిని మరోసారి పెంచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇంకా చాలామంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్ సమర్పించలేకపోయారు. గడువు దాటిపోతే ఏమవుతుంది? అలాంటివారికి ఇప్పుడు మూడు మార్గాలు ఉన్నాయని ట్యాక్స్‌బడ్డి డాట్‌కామ్ వ్యవస్థాపకుడు సుజిత్ బంగార్ చెప్పారు.

- Advertisement -

బిలేటెడ్ రిటర్న్:
పన్ను రిటర్న్స్ ఫైలింగ్ విషయంలో డెడ్‌లైన్ మిస్ అయిన వారికి ఇది మొదటి అవకాశం. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 139(4) ప్రకారం డిసెంబర్ 31 వరకు దాఖలు చేసుకోవచ్చు. సాధారణ రిటర్న్‌లాగే ఇది ప్రాసెస్ అవుతుంది. అయితే జరిమానా తప్పదు. వ్యక్తి ఆదాయం రూ.5 లక్షలకుపైగా ఉంటే రూ.5,000… అంతకంటే తక్కువైతే రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 234A ప్రకారం వడ్డీ కూడా పడుతుంది. అంతేకాదు క్యారీఫార్వర్డ్ లాస్‌లు, కొన్ని ముఖ్యమైన డిడక్షన్‌లు కోల్పోతారు. అయితే టీడీఎస్/టీసీఎస్ క్రెడిట్‌లు వాలిడేట్ అవుతాయి. దీనితో పెద్ద నష్టాన్ని తప్పించుకోవచ్చు.

రివైజ్డ్ రిటర్న్:
రిటర్న్ ఫైల్ చేసే సమయంలో పొరపాట్లు జరిగినా.. తర్వాత గుర్తించినా డిసెంబర్ 31లోపల రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. బిలేటెడ్ రిటర్న్ అయినా.. దీనిని సరిచేసుకోవచ్చు. ఒకసారి చట్టపరమైన ఆడిట్ లేదా అసెస్స్మెంట్ మొదలైతే మాత్రం ఇది సాధ్యం కాదు.

అప్డేటెడ్ రిటర్న్:
ఇది చివరి కేటగిరీ అవకాశం. గడువులు, రివిజన్‌ డెడ్‌లైన్ మిస్ అయినా లేదా పొందుపరచని ఆదాయం గుర్తించినా ఇది ఉపయోగించుకోవచ్చు. 2025 ఫైనాన్స్ చట్టం ప్రకారం దీనిని 48 నెలలవరకు ఫైల్ చేయవచ్చు. కానీ ఇది అత్యంత ఖర్చైన ఆప్షన్. మొత్తం పన్ను + వడ్డీపై అదనంగా 25% నుంచి 70% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి రిటర్న్ ద్వారా పన్ను తగ్గించుకోవటమో, నష్టం చూపించటమో, రీఫండ్ క్లెయిమ్ చేయటం కుదరదు.

ఇప్పటికైనా వెంటనే చురుకుగా స్పందించాలి. డెడ్‌లైన్ మిస్ చేసిన వారు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తు్న్నారు. పొరపాట్లు చేసిన వారు రివైజ్ చేసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ITR-Uని వాడకండి. గడువులోపు సరైన చర్యలు తీసుకుంటే పెద్ద ఆర్థిక భారాల నుంచి పన్ను చెల్లింపుదారులు తప్పించుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad