Gold Rate Today: ఈవారం దసరా పండుగ దగ్గర పడుతోంది. పండక్కి కొత్త బట్టలు కొంచెం బంగారం, వెండి కొనుక్కుందాం అనుకునే వారికి ప్రస్తుతం ధరలను చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసిడి, వెండి ధరలు పెరగటం సామాన్య భారతీయ మధ్యతరగతికి అస్సలు మింగుడుపడటం లేదు.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
సోమవారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.95 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.11, 640 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.10,670 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.1000 పెరగటంతో రూ.లక్షా 60వేల వద్దకు చేరుకుని చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.11,673, ముంబైలో రూ.11,640, దిల్లీలో రూ.11,655, కలకత్తాలో రూ.11,640, బెంగళూరులో రూ.11,640, కేరళలో రూ.11,640 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,700, ముంబైలో రూ.10,670, దిల్లీలో రూ.10,685, కలకత్తాలో రూ.10,670, బెంగళూరులో రూ.10,670, కేరళలో రూ.10,670గా ఉన్నాయి.


