Montra Rhino 5538 EV Launched: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా అనేక కంపెనీలు కొత్త EV మోడళ్లను తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త మోంట్రా రైనో 5538 EV 4×2 TT ట్రక్కును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ట్రక్ ను ప్రత్యేకంగా లాజిస్టిక్స్, హెవీ-డ్యూటీ కార్యకలాపాల కోసం రూపొందించారు. ఇందులో అనేక అధునాతన ఫీచర్లను అందించారు. ఇప్పుడు ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
కంపెనీ దీని ఈ ట్రక్ ను మార్చుకునే ఆప్షన్‌లతో ప్రారంభించింది. ఇది 282 kWh LFP బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒకే ఛార్జ్‌పై 198 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. స్థిర బ్యాటరీ వెర్షన్ వేగవంతమైన ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే, బ్యాటరీని మార్చడానికి కేవలం ఆరు నిమిషాలు పడుతుంది. ఇక దీని పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, మోటారు 380 హార్స్‌పవర్, 2000 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌తో కూడా వస్తుంది. ఇది డ్రైవింగ్‌ను సున్నితంగా చేస్తుంది.
కంపెనీ మోంట్రా రైనో 5538 EVని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఫిక్స్‌డ్ బ్యాటరీ వెర్షన్ రూ.1.15 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. అటు రిమూవబుల్ బ్యాటరీ వెర్షన్ ధర రూ.1.18 కోట్లు ధరల వారీగా, ఈ ట్రక్ ప్రీమియం విభాగంలోకి వస్తుంది. కానీ, దీని ప్రత్యేక లక్షణాలు, అధునాతన బ్యాటరీ సాంకేతికత దీనిని ప్రత్యేకంగా చేస్తాయి.
మోంట్రా రైనో 5538 EV 4×2 TT ట్రక్ శక్తివంతమైనది. హైటెక్ మాత్రమే కాదు. దీని బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ కూడా దీనిని ఇతర ట్రక్కుల నుండి వేరు చేస్తుంది. 198 కి.మీ పరిధి, 380 hp మోటారు లాజిస్టిక్స్ రంగానికి ఇది గొప్ప ఎంపిక. భవిష్యత్తులో ఈ ట్రక్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన విభాగాన్ని గణనీయంగా మార్చగలదు.


