Saturday, November 15, 2025
Homeబిజినెస్Navratri Auto Sales: జీఎస్టీ ఎఫెక్ట్ సెన్సేషన్ సేల్.. పండక్కి ప్రతి 2 సెకండ్లకు ఒక...

Navratri Auto Sales: జీఎస్టీ ఎఫెక్ట్ సెన్సేషన్ సేల్.. పండక్కి ప్రతి 2 సెకండ్లకు ఒక కారు.. సెకనుకు 3 టూవీర్ల అమ్మకాలు..!

Car and Bike Sales : ఈ ఏడాది నవరాత్రి నుంచి దీపావళి దాకా 42 రోజుల పండుగ సీజన్లో భారత ఆటోమొబైల్ రంగానికే సువర్ణ యుగాన్ని తెచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకో కారు, ప్రతి సెకనుకి దాదాపు మూడు ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతుండడంతో డీలర్లు డెలివరీల కోసం తిప్పలు పడాల్సి వచ్చింది. ప్రధానంగా జీఎస్టీ రేట్ల మార్పు వాహన విక్రయాలపై విపరీతమైన ప్రభావం చూపాయి. దేశవ్యాప్తంగా షోరూంలు సాధారణ సమయాలకన్నా ఎంతో ఎక్కువ సమయం తెరిచి ఉంచాల్సి వచ్చింది.

- Advertisement -

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) ప్రకారం.. ఈ 42 రోజుల వ్యవధిలో 7.67 లక్షల ప్యాసెంజర్ వాహనాలుకార్లు, SUVలు, వాన్లు విక్రయించబడ్డాయి. ద్విచక్ర వాహనాల సంఖ్య 40.5 లక్షల వరకు చేరింది. సగటున ప్రతి రోజు 18,261 కార్లు, 96,500 టూవీలర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కార్ల విక్రయాలు 23%, ద్విచక్ర వాహనాల విక్రయాలు 22% వృద్ధిని నమోదు చేశాయి. ఈ పెరుగుదల ఆదాయాలను కూడా కొత్త గరిష్టాలకు చేర్చింది. కార్ల విభాగంలో రూ.76,700–84,400 కోట్ల టర్నోవర్‌ లెక్కించబడింది. కాగా ద్విచక్ర వాహనాలు రూ.36,500–40,500 కోట్ల వరకూ టర్నోవర్ సాధించాయి.

దీనిని భారత ఆటోమొబైల్ రిటైల్ రంగానికి మైలురాయిగా వర్ణించారు FADA అధ్యక్షుడు సి.ఎస్. విజయేశ్వర్. దేశవ్యాప్తంగా డీలర్లు భారీ సంఖ్యలో ఎంక్వైరీలు, అధిక కొనుగోళ్లు, వినియోగదారుల్లో కనిపించిన ఆత్మవిశ్వాసంతో సంతోషం వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం రూరల్ డిమాండ్ పుంజుకోవటంగా తెలుస్తోంది. గ్రామీణ మార్కెట్.. పట్టణ ప్రాంతాల కంటేవాహన విక్రయాల వృద్ధి మూడు రెట్లు ఎక్కువగా ఉంది. పంట దిగుబడులు, సులభమైన రుణ సౌకర్యాలు, వాహన ఆఫర్లు గ్రామీణ వినియోగదారులను ఆకర్షించాయి. ఫలితంగా మొత్తం కార్ల విక్రయాల్లో గ్రామీణ మార్కెట్ వాటా 42%కు చేరింది.

మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి ప్రధాన ఆటో తయారీదారులు చిన్న కార్ల అమ్మకాలతో కొత్త రికార్డులు నెలకొల్పగా.. టూవీలర్ వాహనాల అమ్మకాలలో గ్రామీణ ప్రాంతాల వాటా 61%కు చేరింది. ఈ ఉత్సవ సీజన్ భారత ఆటోమొబైల్ రంగానికి కొత్త ఉత్సాహాన్ని నింపిందని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad