Sunday, March 8, 2026
Homeబిజినెస్PAN card rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న పాన్‌ కార్డు రూల్స్‌!

PAN card rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న పాన్‌ కార్డు రూల్స్‌!

New financial year 2026:ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పలు ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పన్నుల వ్యవస్థను ప్రభావితం చేసే కొన్ని కీలక సవరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంతో పాటు పాన్ కార్డు సంబంధిత నిబంధనల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది.

- Advertisement -

ఆదాయపు పన్ను నియమాలు..

కొత్త ఐటీ చట్టం, సవరించిన ఆదాయపు పన్ను నియమాలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ మార్పులకు సంబంధించిన ముసాయిదా ప్రతిని ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. ఆ ముసాయిదాలో పలు ముఖ్య అంశాలు చేర్చడం జరిగింది. దీనికి తుది ఆమోదం లభించిన వెంటనే కొత్త ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.

Also Read: https://teluguprabha.net/business/bsnl-holi-offer-2026-164-days-validity-bumper-plan/

ఆస్తి లావాదేవీలకు సంబంధించిన..

ఈ మార్పుల్లో ముఖ్యంగా ఆస్తి లావాదేవీలకు సంబంధించిన పాన్ కార్డు నియమాల్లో సడలింపులు ఇవ్వడం ప్రాధాన్యం పొందింది. ప్రస్తుత విధానం ప్రకారం ఇల్లు, ఫ్లాట్ లేదా ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం సమయంలో రూ.10 లక్షలకు మించి విలువ ఉంటే పాన్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. అయితే ఇప్పుడు ఈ పరిమితిని పెంచే నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే…

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ప్రతిపాదిత నియమాల ప్రకారం రూ.20 లక్షలలోపు విలువ గల ఆస్తి కొనుగోలు లేదా విక్రయాల సందర్భంలో పాన్ కార్డు సమర్పించాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ పరిమితి లోపల జరిగే లావాదేవీలకు పాన్ వివరాలు తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. రూ.20 లక్షలకు మించిన విలువ గల ఆస్తుల విషయంలో మాత్రం పాన్ నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయి.

ఆస్తి లావాదేవీలకూ పాన్ సమర్పణ…

ఇంతకు ముందు రూ.10 లక్షల పరిమితి కారణంగా చిన్న మొత్తాల ఆస్తి లావాదేవీలకూ పాన్ సమర్పణ అవసరమయ్యేది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఆస్తుల ధరలు గణనీయంగా పెరగడంతో ఈ పరిమితి సరిపోవడం లేదని భావించారు. అందుకే పరిమితిని రూ.20 లక్షలకు పెంచే ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇది ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబించేలా సవరణగా పేర్కొనబడింది.

ఈ మార్పుతో తక్కువ విలువ గల ఆస్తుల కొనుగోలు, విక్రయాలు సులభం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ ఆస్తి బదిలీలు, చిన్న స్థాయి కొనుగోళ్లు చేసే వారికి కాగితపు ప్రక్రియ తగ్గుతుంది. పాన్ సమర్పణ అవసరం లేకపోవడం వల్ల డాక్యుమెంటేషన్ సులభతరం అవుతుంది.

అయితే రూ.20 లక్షలకు మించిన ఆస్తి లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. అధిక విలువ గల లావాదేవీలను వ్యక్తుల ఆదాయ వివరాలతో అనుసంధానించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖకు ఆస్తి కొనుగోళ్లు, వ్యక్తిగత ఆదాయ రికార్డులను సరిపోల్చడం సులభం అవుతుంది.

పన్ను ఎగవేతను గుర్తించే..

అధిక మొత్తాల రియల్ ఎస్టేట్ లావాదేవీలను పర్యవేక్షించడం ద్వారా పన్ను ఎగవేతను గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్తి మార్కెట్‌లో పారదర్శకత పెంపు కూడా ఈ చర్య ద్వారా సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. అధిక విలువ గల ఆస్తుల విషయంలో పాన్ వివరాలు ఉండటం వల్ల లావాదేవీలు స్పష్టంగా నమోదవుతాయి.

Also Read: https://teluguprabha.net/business/war-effect-today-stock-markets-started-with-huge-losses/

ముసాయిదా ప్రతిపాదనకు తుది ఆమోదం లభించిన తర్వాతే ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఆమోదం వచ్చినట్లయితే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ సవరించిన నిబంధనలు దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతోంది. దీంతో పాన్ కార్డు వినియోగం, ఆస్తి లావాదేవీల విధానంలో గణనీయమైన మార్పు కనిపించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News