Homeబిజినెస్New Rules : నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్...సిగరెట్, గుట్కా నుంచి గ్యాస్ సిలిండర్...

New Rules : నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్…సిగరెట్, గుట్కా నుంచి గ్యాస్ సిలిండర్ రేట్లు ఇవే..!

Feb 1st:ఫిబ్రవరి వచ్చేసింది.. క్యాలెండర్ మారడమే కాదు, మన జేబుపై ప్రభావం చూపే కీలక మార్పులు కూడా ఈరోజు (ఫిబ్రవరి 1, 2026) నుంచే మొదలయ్యాయి. ఒకవైపు దేశమంతా బడ్జెట్ సందడిలో ఉంటే, మరోవైపు సామాన్యుడి నెలవారీ లెక్కలను తలకిందులు చేసేలా కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మీ జేబుపై, మీ రోజువారీ అలవాట్లపై నేరుగా ప్రభావం చూపే ఆ 4 కీలక మార్పులు ఇవే…

- Advertisement -

1. సిగరెట్ల ధరలకు రెక్కలు
బడ్జెట్ అనగానే అందరూ ఆశించేది ఆదాయపు పన్ను తగ్గింపు.. కానీ పొగాకు ఉత్పత్తుల విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగానే ఉంటోంది. ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి బడ్జెట్‌లో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి వాటిపై అదనపు సెస్ లేదా ఎక్సైజ్ డ్యూటీ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే, వ్యసనపరులు నేటి నుంచి వీటి కోసం మరిన్ని అదనపు రూపాయలు ఖర్చు చేయాల్సిందే.

2. వంటింటి బడ్జెట్
ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు ఎల్పీజీ ధరలను సవరించడం ఆనవాయితీ. ఈసారి కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, హోటల్ యజమానులకు ఇది కీలకమైన అంశం. ఒకవేళ డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఏవైనా స్వల్ప మార్పులు జరిగితే, అది నేరుగా గృహిణుల నెలవారీ వంటింటి బడ్జెట్‌ను ప్రభావితం చేస్తుంది.

Union Budget 2026: రూ. 15 లక్షల వరకు నో ట్యాక్స్.? గృహ రుణాలపై భారీ ఊరట.!

 

3. వాహనదారులకు గుడ్ న్యూస్
హైవేలపై ప్రయాణించే వారికి ఇది నిజంగానే ఊరట కలిగించే వార్త. గతంలో ఫాస్టాగ్ కేవైసీ (KYC) అప్‌డేట్ కోసం పదే పదే పడే ఇబ్బందులకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇకపై ఆ బాధ్యతను నేరుగా బ్యాంకులే చూసుకుంటాయి. మీరు కొత్త ఫాస్టాగ్ తీసుకునే ముందే బ్యాంకులు మీ వివరాలను పూర్తిగా ధృవీకరిస్తాయి. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద అకస్మాత్తుగా కార్డులు బ్లాక్ అవ్వడం లేదా డాక్యుమెంట్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం వంటి సమస్యలు తప్పుతాయి.

4. డబ్బుల బదిలీ ఇక మరింత భారం
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులైతే, మీ ఆన్‌లైన్ నగదు బదిలీలపై నిఘా ఉంచండి.Instant Payment Service ద్వారా తక్షణం డబ్బులు పంపే నిబంధనల్లో మార్పులు వస్తున్నాయి. ఇవి ఫిబ్రవరి 15 నుంచి పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి.

రూ. 25,000 నుంచి రూ. 5 లక్షల వరకు బదిలీ చేసేవారికి అదనపు సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. ముఖ్యంగా రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ చేస్తే, సుమారు రూ. 10తో పాటు అదనంగా జీఎస్టీ (GST) చెల్లించాల్సి ఉంటుంది. లనిబంధనలు మారుతున్నాయి.. వాటితో పాటు మన ఖర్చుల ప్రణాళికను కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు చేసేటప్పుడు, సర్వీస్ ఛార్జీల భారం పడకుండా ఇతర ఉచిత మార్గాలను (UPI వంటివి) పరిశీలించడం మేలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News