Silver Hallmarking: సెప్టెంబర్ 1, 2025 నుంచి వెండి ఆభరణాలకు సంబంధించి కొత్త హాల్‌మార్కింగ్ రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ఇకపై మార్కెట్‌లో HUID (Hallmark Unique Identification Number) ఉన్న సిల్వర్ ఆభరణాలు మాత్రమే వ్యాపారులు అమ్మాల్సి ఉంటుంది. హాల్‌మార్క్ లేకుండా విక్రయించే వెండి నగలను కొనొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన నిబంధన వల్ల వినియోగదారులకు ప్రయోజనాలతో పాటు కొందరు వ్యాపారులు చేసే మోసాలను అరికట్టాలను భారత ప్రభుత్వం చూస్తోంది.
సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్..
వెండి నగలకు కూడా బంగారం మాదిరిగానే హాల్‌మార్క్ తప్పనిసరి చేయబడుతోంది. దీంతో సెప్టెంబర్ 1 నుంచి ప్రతి వెండి ఆభరణం HUID అనే ప్రత్యేక నెంబర్‌తో మార్క్ చేయబడుతుంది. ఇకపై బంగారం మాదిరిగానే వెండిపై కూడా 6 అంకెల HUID హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయబడుతోంది. హాల్‌మార్కింగ్ విధానం ప్రస్తుతం స్వచ్ఛందంగా అమలు చేయబడుతోంది.
HUID హాల్‌మార్కింగ్ వల్ల కొనుగోలుదారులకు ప్రయోజనాలు ఇవే..
* HUID ఉన్న నగలు అధికారికంగా పరీక్షించబడతాయి. అలాగే వెండిలో ఉన్న స్వచ్ఛతను నిర్ధారించి తగిన ప్రమాణాలు పాటించారో లేదో పరిశీలించబడుతుంది.
* ప్రతి ఆభరణానికి ప్రత్యేక HUID నంబర్ ఇస్తారు. వినియోగదారులు BIS CARE App ద్వారా ఈ నెంబర్‌ను వెరిఫై చేయవచ్చు. దీంతో కొనుగోలు చేసిన నగ అసలు స్టోర్, స్వచ్ఛత స్థాయి వంటి పూర్తి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు.
* నకిలీ వెండి నగలను అరికట్టడంతో పాటు మోసాలను అడ్డుకోవడం సులభం అవుతుంది హాల్ మార్కింగ్ వల్ల.
* స్వచ్ఛత ప్రమాణాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది.
దేశంలోని ప్రజలకు నాణ్యమైన సిల్వర్ మాత్రమే వ్యాపారులు అమ్మేలా చర్యలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తున్నందున కొనుగోలుదారులు HUID హాల్‌మార్క్ ఉన్న వస్తువులు, నగలను కొనటం మంచిదని గుర్తుంచుకోండి. అలాగే నగలపై ముద్రించిన నెంబర్లను స్వయంగా బీఎస్ఈ కేర్ యాప్ ద్వారా చెక్ చేసుకుని నిర్థారించుకోండి. ఇది భవిష్యత్తులో మీ వస్తువులను అమ్ముకోవాలనుకున్నప్పుడు నాణ్యత విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


