Sunday, November 16, 2025
Homeబిజినెస్Market Fall: భారీ నష్టాల్లో సెన్సెక్స్ నిఫ్టీ.. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ ఢమాల్..!

Market Fall: భారీ నష్టాల్లో సెన్సెక్స్ నిఫ్టీ.. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ ఢమాల్..!

Market Crash: భారత స్టాక్ మార్కెట్లు వినాయక చవితి సెలవు తర్వాత నేడు భారీ నష్టాల్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 970 పాయింట్లకు పైగా నష్టపోగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 200 పాయింట్ల మేర నష్టాన్ని చూసింది. అయితే కొద్దిసేపిటికి భారీ నష్టాల నుంచి తిరిగి కోలుకున్న సూచీలు స్వల్ప ఊరటను అందించాయి.

- Advertisement -

 

Janasena : వ్యూహాలకు పదును పెట్టిన పవన్ కల్యాణ్

ఉదయం 9.58 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 440 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 130 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 300 పాయింట్లకు పైగా మిడ్ క్యాప్ నిఫ్టీ సూచీ 400 పాయింట్ల మేర నష్టంలో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ట్రంప్ టారిఫ్స్ ప్రభావంతో భారత ఎగుమతులు, ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందనే వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను భారీగా దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రధానంగా నేడు మార్కెట్లలో ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లను భారీగా ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో సూచీలు భేజారాయి. అలాగే అన్ని రంగాలకు చెందిన సూచీలు కూడా నష్టాలతో ఎరుపెక్కాయి. అలాగే పవర్ రియల్టీ రంగాల స్టాక్స్ కూడా భాగానే నష్టాలను చూస్తున్నాయి. ఇంట్రాడేలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్ మేజర్ లూజర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టి స్టాక్ మాత్రం లాభపడి గెయినర్లుగా నిఫ్టీ సూచీలో కొనసాగుతున్నాయి.

మార్కెట్లపై నిపుణులు మాటేంటి..
భారత్ పై ఇప్పటికే అమలులోకి వచ్చిన 50 శాతం టారిఫ్స్ సమీప భవిష్యత్తులో మార్కెట్ సెంటిమెంట్లపై ప్రభావం చూపుతుందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌కు చెందిన వి.కె. విజయకుమార్ అన్నారు. అయితే మార్కెట్ ఈ అధిక సుంకాలను స్వల్పకాలికం కొనసాగవచ్చని భావిస్తోందని ఆయన చెప్పారు. ఈ సమస్య త్వరలో పరిష్కరించబడుతుందని మార్కెట్ వర్గాలు ఆశాభావంగా ఉన్నట్లు చెప్పారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మార్కెట్లను కొనుగోళ్ల ద్వారా స్థిరీకరించటానికి సిద్ధంగా ఉన్నారని విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలను వీరు ఎదుర్కోగలరని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad