Nissan Magnite Kuro Edition Launched: నిస్సాన్ భారత మార్కెట్లో SUV సెగ్మెంట్ వాహనాలను విక్రయిస్తోంది. తయారీదారు కురో ఎడిషన్‌ను కాంపాక్ట్ SUV విభాగంలో అందించే నిస్సాన్ మాగ్నైట్ కొత్త ఎడిషన్‌గా విడుదల చేసింది. తయారీదారు ఈ ఎడిషన్ లో అనేక కొత్త ఫీచర్లు, కొత్త థీమ్‌లను అందించారు. దీనితో పాటు, SUV మెటాలిక్ గ్రే కలర్‌ను టెక్నా, టెక్నా +, N కనెక్టా వేరియంట్‌లలో అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఈ ఎడిషన్ కు సంబంధించి ఫీచర్లు, ఇంజిన్, ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తయారీదారు నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్‌లో బ్లాక్ కలర్ థీమ్ ఆధారంగా రూపొందించారు. ఈ థీమ్‌ను డాష్‌బోర్డ్, గేర్ షిఫ్ట్ లివర్, స్టీరింగ్, సన్ వైజర్, డోర్ ట్రిమ్‌లో చూడవచ్చు.
నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్‌లో అనేక గొప్ప ఫీచర్లను అందించారు. ఈ కారులో బ్లాక్ రూఫ్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, అర్కామిస్ ఆడియో సిస్టమ్, ఆటో డిమ్మింగ్ ORVM, ఇల్యూమినేటెడ్ గ్లోవ్ బాక్స్, రియర్ AC వెంట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇక భద్రత కోసం..ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESC, TCS, HSA, బ్రేక్ అసిస్ట్, TPMS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: Cars: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే..
ఈ ఎడిషన్ టర్బో పెట్రోల్, సాధారణ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంచారు. దీని ఒక-లీటర్ సామర్థ్యం గల నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71 bhp శక్తిని, 96 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో, ఐదు స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక ఇచ్చారు. మరోవైపు..ఒక-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 98 bhp శక్తిని, 160 న్యూటన్ మీటర్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనితో, ఐదు స్పీడ్ మాన్యువల్, CVT ట్రాన్స్‌మిషన్ ఎంపిక ఇచ్చారు.
నిస్సాన్ భారతదేశంలో మాగ్నైట్ కురో ఎడిషన్‌ను రూ. 8.30 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. కాగా కస్టమర్లు ఈ కొత్త ఎడిషన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రూ. 11 వేలకు బుక్ చేసుకోవచ్చు. కాంపాక్ట్ SUV విభాగంలో ఇది మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సైరోస్, కియా సోనెట్, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, మహీంద్రా XUV 3XO, స్కోడా కైలాక్ వంటి SUV లతో నేరుగా పోటీపడుతుంది.


