Homeబిజినెస్Regulations : అక్టోబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. మీ జేబుకు చిల్లు పడకుండా ఇవి...

Regulations : అక్టోబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. మీ జేబుకు చిల్లు పడకుండా ఇవి తెలుసుకోండి

October 1 financial rule changes in India : నెల మారింది.. సరికొత్త ఆర్థిక మార్పులు అమల్లోకి వచ్చాయి! ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం’ కాకూడదంటే ఎప్పటికప్పుడు మారే నిబంధనలపై కన్నేసి ఉంచాల్సిందే. అక్టోబరు 1 నుంచి బ్యాంకు లావాదేవీలు మొదలుకొని వంటింటి బడ్జెట్‌ వరకు పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

- Advertisement -

ఎస్​బీఐ ఏటీఎం లావాదేవీలు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాలరీ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇప్పటివరకు కల్పించిన 10 ఉచిత లావాదేవీల పరిమితిని అక్టోబరు 1 నుంచి 5కి కుదించింది. అయితే ఎస్‌బీఐ సొంత ఏటీఎంలలో లావాదేవీలపై ఎలాంటి పరిమితి ఉండదు.

ఎల్‌పీజీ ఈ-కేవైసీ (LPG e-KYC) తప్పనిసరి: గ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు అక్టోబరు 1 నుంచి రాయితీని కోల్పోనున్నారు; వీరు మార్కెట్ ధరకే సిలిండర్ పొందాల్సి ఉంటుంది.

బల్క్ ఎఫ్‌డీల కొత్త మార్గదర్శకాలు: రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకల్లా వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని ఆర్‌బీఐ (RBI) బ్యాంకులను ఆదేశించింది. డిపాజిటర్ల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని స్పష్టం చేసింది. త్వరలో జరిగే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) భేటీపై కూడా మార్కెట్ దృష్టి ఉంది. ఈ కొత్త మార్పులను గమనించి వ్యవహరిస్తే అనవసర రుసుముల భారం తప్పుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News