HomeTop StoriesBank Loan : బ్యాంక్‌ లోన్‌ తీసుకొని చనిపోతే.. ఆ లోన్‌ ఎవరు కట్టాలి ?

Bank Loan : బ్యాంక్‌ లోన్‌ తీసుకొని చనిపోతే.. ఆ లోన్‌ ఎవరు కట్టాలి ?

Odisha High Court: రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడంలో ఆలస్యం జరిగినా లేదా విఫలమైనా, బ్యాంకులు తమ బకాయిలను రికవరీ చేసుకోవడానికి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం సర్వసాధారణం. అయితే, ఒక విచిత్రమైన కేసులో, భార్య తీసుకున్న రుణానికి భర్త హామీదారుడిగా ఉండగా, ఆ రుణాన్ని రికవరీ చేయడానికి బ్యాంకు ఏకంగా భర్త పెన్షన్ ఖాతాలోని డబ్బులనే డెబిట్ చేసుకుంది. దీనిపై ఒడిశా హైకోర్టు కీలకమైన మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది.

- Advertisement -

రిటైర్డ్ ఉద్యోగికి షాక్
ఈ సంఘటనకు గురైన శ్రీ మల్లిక్, మంచేశ్వర్‌లోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగి. ఆయనకు నెలవారీ పెన్షన్ దాదాపు రూ.35 వేలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లోని తన జాయింట్ అకౌంట్లోకి వస్తుండేది.

మల్లిక్ భార్య రవాణా వాహనాల కోసం బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో – ఒకసారి రూ.5.9 లక్షలు, మరోసారి రూ.8 లక్షలు , రూ.7.45 లక్షల కారు లోన్ – తీసుకుంది. ఈ రుణాలన్నింటికీ శ్రీ మల్లిక్ హామీదారుడిగా (Guarantor) సంతకం చేశారు. అయితే, రెండు రవాణా వాహనాలకు సంబంధించిన లోన్లు తిరిగి చెల్లించబడకపోవడంతో బ్యాంకు వాటిని డీఫాల్ట్ జాబితాలో చేర్చింది.

పెన్షన్ డబ్బులు మాయం
లోన్ రికవరీకి ఇతర మార్గాలు లేకపోవడంతో, బ్యాంకు జాయింట్ అకౌంట్‌లో ఉన్న డబ్బులపై కన్నేసింది. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో రెండు విడతలుగా – ఫిబ్రవరి 17న రూ.2.3 లక్షలు, ఫిబ్రవరి 19న మరో రూ.2.7 లక్షలు – మొత్తం రూ.5 లక్షలను బ్యాంకు మల్లిక్ ఖాతా నుంచి తన అనుమతి లేకుండా డెబిట్ చేసుకుంది.

తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న పెన్షన్ డబ్బులు హఠాత్తుగా మాయమవడంతో షాక్ తిన్న మల్లిక్ బ్యాంకును సంప్రదించారు. తాను కేవలం హామీదారుడిని మాత్రమేనని, తన అనుమతి లేకుండా పెన్షన్ డబ్బులను తీసుకోకూడదని, వాటిని వెంటనే తిరిగి జమ చేయాలని కోరినా బ్యాంకు నుండి సరైన స్పందన రాలేదు.

ఒడిశా హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
దీంతో శ్రీ మల్లిక్ న్యాయం కోసం ఒడిశా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, రిటైర్ అయిన వ్యక్తికి ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అందించే పెన్షన్ డబ్బులను బ్యాంకు ఈ విధంగా రికవరీ చేసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రతకు ఉద్దేశించిన పెన్షన్ నిధులను హామీదారుడి (Guarantor) ఖాతా నుంచి కూడా తీసుకోకూడదని ఆదేశించింది.

న్యాయస్థానం బ్యాంకుకు ఈ రూ..5 లక్షల మొత్తాన్ని వెంటనే శ్రీ మల్లిక్‌కు తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు దేశంలోని పెన్షనర్లు మరియు రుణాలకు హామీదారులైన వారికి ఒక ముఖ్యమైన ఉపశమనం , రక్షణగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News