Odysse SUN Launched: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు వీటిని కొనడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అనేక ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ తయారీదారులు మార్కెట్లోకి కొత్త వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. అయితే, భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రీమియం ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ తన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒడిస్సే సన్ ను మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఆధునిక రైడర్‌ను దృష్టిలో ఉంచుకుని,సౌకర్యవంతమైన రైడ్ కోసం దీని రూపొందించింది. అంతేకాకుండా ఇందులో అనేక స్మార్ట్ ఫీచర్లు కూడా అందించారు. ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి ఇంజిన్, ఫీచర్లు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
ఒడిస్సే సన్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో తీసుకొచ్చారు. దీని 1.95 Kwh బ్యాటరీ ఒకే ఛార్జ్‌లో 85 కి.మీ.ల వరకు ప్రయాణిస్తుంది. మరోవైపు 2.90 Kwh బ్యాటరీ ఒకే ఛార్జ్‌లో 130 కి.మీ.ల వరకు రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.లు. స్కూటర్ బ్యాటరీలు AIS 156 ఆమోదించబడ్డాయి. ఫలితంగా బ్యాటరీని కేవలం 4 నుండి 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
Also Read: Health Tips: రోజూ ఓ పచ్చి టమాట తింటే చాలు, బీపీ తో పాటు గుండె జబ్బులు కూడా పరార్!
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2500W పీక్ మోటార్‌ను కలిగి ఉంటుంది. దీనిలో డ్రైవ్, పార్కింగ్, రివర్స్ అనే మూడు ట్రాన్స్‌మిషన్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేక్‌లు, డిజిటల్ మీటర్, హైడ్రాలిక్ మల్టీ-లెవల్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్ వంటివి ఉన్నాయి.
అంతేకాకుండా ఒడిస్సే సన్ 32-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ కలిగి ఉంది. ఇందులో కీలెస్ స్టార్ట్-స్టాప్, LED లైటింగ్ సిస్టమ్, మెరుగైన భద్రత కోసం డబుల్ ఫ్లాష్ రివర్స్ లైట్ వంటి ఫీచర్లను అందించారు. దీనితో పాటు, ఏవియేషన్-గ్రేడ్ సీటింగ్, ప్లస్-సైజ్ ఎర్గోనామిక్ డిజైన్, సెగ్మెంట్-లీడింగ్ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఒడిస్సే సన్ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు రంగు ఎంపికలలో లభిస్తోంది. అవి పాటినా గ్రీన్, గన్‌మెటల్ గ్రే, ఫాంటమ్ బ్లాక్, ఐస్ బ్లూ. ధర విషయానికి వస్తే.. ఒడిస్సే సన్ 1.95 Kwh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 81,000గా, దీని 2.90 Kwh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 91,000గా ఉంచారు. ఒడిస్సే సన్ బుకింగ్ ఆన్‌లైన్, కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంది.


