Ola Announces Discounts on Electric Scooters: జీఎస్టీ శ్లాబులను సవరించడం వల్ల ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ధరలు భారీగా తగ్గాయి. దీనికి తోడుగా దసరా నవరాత్రుల పేరిట పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ముహురత్ మహోత్సవ్ పేరిట డిస్కౌంట్లు: దసరా నవరాత్రుల సందర్భంగా పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. ఓలా కంపెనీ తమ బైక్‌లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ముహురత్ మహోత్సవ్ పేరిట S1 X 2kWh, Roadster X 2.5kW మోటర్ సైకిళ్లను కేవలం రూ.49,999కే విక్రయిస్తున్నట్లు తెలిపింది. S1 Pro+ 5.2kWh, Roadster X+ 9.1kWh స్కూటర్‌లను కేవలం రూ.99,999గా నిర్ణయించింది. అయితే ఈ ఆఫర్లు అక్టోబర్ 1 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అటు జీఎస్టీ తగ్గింపు, ఇటు దసరా ఆఫర్లతో బైకులు, కార్లు పెద్దఎత్తున అమ్ముడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో వినియోగదారులు సైతం ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. దీంతో షో రూంలు కళకళలాడుతున్నాయి. బడ్జెట్ వాహనాలపై కూడా భారీ తగ్గింపులు ఉండడంతో వినియోగదారులకు లాభదాయకమేనంటున్నారు విశ్లేషకులు.
ఓలా ఎలక్ట్రిక్ గురించి: ఓలా ఎలక్ట్రిక్ అనేది భారతదేశంలో ఒక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్-హెయిలింగ్ కంపెనీలలో ఓలా ఒకటి. ఇది ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు మరియు కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఓలా రైడ్-షేరింగ్ సేవలను అందించే ఓలా క్యాబ్స్ అనే సంస్థ నుంచి ఇది వేరుగా ఏర్పడింది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ఎయిర్ మరియు ఓలా ఎస్1 ప్రో వంటి స్కూటర్ మోడళ్లతో ఓలా ఎలక్ట్రిక్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ స్కూటర్లు అధిక వేగంతో పాటుగా ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాయి. ఇవి ఆధునిక ఫీచర్లను సైతం కల్గి ఉన్నాయి. అంతే కాకుండా ఇవి విభిన్న రంగులలో సైతం లభిస్తున్నాయి.


