OnePlus: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తూ.. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం వన్ ప్లస్, దేశీయ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ భగవతి ప్రోడక్ట్స్ లిమిటెడ్(BPL)తో భాగస్వామ్యం ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో భారతదేశంలో ప్రీమియం టాబ్లెట్లను తయారు చేయనున్నారు.
ప్రాజెక్ట్ స్టార్ లైట్ లో భాగంగా వన్ ప్లస్ ఈ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా భారత్‌లో తమ ఉత్పత్తి సామర్థ్యాలను మరింత విస్తరించాలన్న దీర్ఘకాలిక లక్ష్యాన్ని వన్ ప్లస్ అమలు చేస్తోంది. వన్ ప్లస్ ఇప్పటికే భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తోంది. తాజాగా, గ్రేటర్ నోయిడాలోని భగవతి ప్రోడక్ట్స్ ప్లాంట్‌లో టాబ్లెట్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ ప్రయత్నం ద్వారా కంపెనీ స్థానిక ఉత్పత్తిని పెంపొందిస్తోంది. తద్వారా భారత వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్న దృష్టితో ముందుకు సాగుతోంది.
Read more: https://teluguprabha.net/business/motilal-oswal-financial-services-invests-rs-400-crore-in-zepto/
భారతదేశంలో టాబ్లెట్లను స్థానికంగా తయారు చేయడం వలన దేశీయ అభివృద్ధికి మద్దతు ఇవ్వడమే కాక, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించగలుగుతున్నాం. ఇది మా భారత ప్రయాణంలో ఒక కీలక ముందడుగు. భారత్ కోసం ఆవిష్కరించడమే కాకుండా, ఇక్కడే పెట్టుబడులు పెట్టి, ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములవ్వడమే మా లక్ష్యం అని వన్ ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ ల్యూకు అన్నారు.
భగవతి ప్రోడక్ట్స్ కో ఫౌండర్ వికాస్ జైన్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ద్వారా వన్ ప్లస్ మా ఖాతాదారుల జాబితాలోకి చేరడం మాకు గర్వకారణం. ఇకపై మా గ్రేటర్ నోయిడా యూనిట్‌లో టాబ్లెట్ల వంటి కొత్త రకమైన ఉత్పత్తులను కూడా తయారు చేసే సామర్థ్యాన్ని మేం సాధించాం. ఈ కొత్త ఫార్మ్ ఫ్యాక్టర్ ఉత్పత్తి ద్వారా మా తయారీ నైపుణ్యం మరింత విస్తరించిందని అన్నారు.
Read more: https://teluguprabha.net/business/new-income-tax-bill-from-april-2026/#google_vignette
2025 లో వన్ ప్లస్ నుండి రెండు ట్యాబ్స్ విడుదల అయ్యాయి. ఇవి రెండు కూడా బీపీఎల్ భాగస్వామ్యంతో దేశంలోనే తయారుచేయబడతాయి. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ కి తగినట్టుగా ఈ భాగస్వామ్యం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.


