OnlyFans Generates $37.6 Million Per Employee: సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్ ‘ఓన్లీఫ్యాన్స్’ (OnlyFans) ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలను కూడా వెనక్కి నెట్టివేసింది. ఉద్యోగుల పరంగా అత్యధిక ఆదాయ సామర్థ్యాన్ని కలిగిన కంపెనీగా ఇది రికార్డు సృష్టించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో, ఓన్లీఫ్యాన్స్ ఒక్కో ఉద్యోగికి ఏకంగా $37.6 మిలియన్లు (దాదాపు ₹313 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించినట్లు బార్‌చార్ట్ (Barchart) నివేదిక వెల్లడించింది.
ప్రపంచ టెక్ దిగ్గజాలైన ఎన్విడియా (ఉద్యోగికి $3.6 మిలియన్లు), ఆపిల్ ($2.4 మిలియన్లు) కంటే కూడా ఓన్లీఫ్యాన్స్ చాలా ముందుంది. ఆశ్చర్యకరంగా, లండన్ కేంద్రంగా పనిచేసే ఈ యూకే ఆధారిత సంస్థ కేవలం 42 మంది ఉద్యోగులతో ఇంత భారీ విజయాన్ని సాధించింది.
ఆదాయం, లాభాల జోరు
2024 ఆర్థిక సంవత్సరంలో, ఓన్లీఫ్యాన్స్ మొత్తం $7.22 బిలియన్ల (సుమారు ₹60 వేల కోట్లు) లావాదేవీల విలువ నుంచి $1.41 బిలియన్లు (సుమారు ₹11,700 కోట్లు) నికర ఆదాయాన్ని నమోదు చేసింది.
- క్రియేటర్ల సంఖ్య: 4.6 మిలియన్లకు పైగా
- రిజిస్టర్డ్ యూజర్లు: 377 మిలియన్లు
- పన్నుకు ముందు లాభం: $684 మిలియన్లు
- నికర లాభం: $520 మిలియన్లు
ALSO READ: Cheapest CNG Cars: తక్కువ బడ్జెట్‌లో సీఎన్‌జీ కారు కొనాలా..?రూ.4 లక్షల బడ్జెట్..33 కి.మీ. మైలేజ్!
ఆదాయం ఎలా వస్తుందంటే?
ఓన్లీఫ్యాన్స్ అనేది సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సోషల్ మీడియా వేదిక. ఇక్కడ క్రియేటర్లు తమ కంటెంట్‌ను (ఫోటోలు, వీడియోలు, లైవ్ స్ట్రీమ్‌లు) నేరుగా తమ ఫ్యాన్స్‌కు అందించి డబ్బు సంపాదిస్తారు. ఈ ప్లాట్‌ఫామ్ కేవలం అడల్ట్ కంటెంట్‌కే కాకుండా, ఫిట్‌నెస్ కోచింగ్, మ్యూజిక్, కుకింగ్ ట్యుటోరియల్స్ వంటి ఇతర కంటెంట్‌కు కూడా వేదికగా ఉంది.
క్రియేటర్ల మొత్తం ఆదాయంలో 20 శాతం కమిషన్‌ను ఓన్లీఫ్యాన్స్ తీసుకుంటుంది. మిగిలిన 80 శాతం క్రియేటర్లకు చెల్లిస్తుంది. 2024లో క్రియేటర్ల ఆదాయం మొత్తం $5.8 బిలియన్లుగా ఉంది. ఈ ఏడాది యజమాని లియోనిడ్ రాడ్విన్స్కీకి డివిడెండ్‌ల రూపంలో $701 మిలియన్లను కంపెనీ పంపిణీ చేసింది.
ALSO READ: Bharat Taxi: ఓలా, ఊబర్‌కు గట్టి పోటీ.. వచ్చే నెలనుంచే ‘భారత్ ట్యాక్సీ’ సేవలు షురూ..!


