Saturday, November 15, 2025
Homeబిజినెస్Pavel Durov: 'ఆ సమయంలో మంచి ఆలోచనలు'- టెలిగ్రామ్‌ సీఈఓ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదేనట.!

Pavel Durov: ‘ఆ సమయంలో మంచి ఆలోచనలు’- టెలిగ్రామ్‌ సీఈఓ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదేనట.!

Pavel Durov Telegram CEO: ఈ రోజుల్లో నిద్ర లేవగానే ఫోన్‌ చూడకుండా మంచం దిగే అలవాటు ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు 5 నిమిషాలే చూద్దాం అనేది కాస్తా గంటల తరబడి అలాగే ఫోన్‌లో తల దూర్చేయడం కామన్‌ అయిపోయింది. దీని ద్వారా నిద్ర పైనే కాదు మన డైలీ యాక్టివిటీస్‌ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. డైలీ రొటీన్‌లో ముందుగా ఫోన్‌ చూడటం.. ఆ తర్వాత అదే పనిగా స్క్రోల్‌ చేయడం ఇలా రోజులో ఎక్కువ భాగం దీనికే కేటాయిస్తున్నారు. అయితే తనకు మాత్రం ఆ అలవాటు లేదని.. రోజులో 12 గంటలు నిద్రకే కేటాయిస్తానని చెబుతున్నారు మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ ఫౌండర్‌, సీఈఓ పావెల్‌ దురోవ్‌..

- Advertisement -

కెరీర్‌లో విజయం సాధించి పారిశ్రామిక వేత్తలు, సోషల్‌ మీడియా దిగ్గజాలుగా ఎదిగిన వారి జీవితాలు ఎందరికో స్ఫూర్తి దాయకం. వాళ్ల డైలీ రొటీన్‌ ఎలా ఉంటుంది.? పర్సనల్‌ లైఫ్‌ను, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను ఎలా బ్యాలెన్సింగ్‌ చేస్తారు.. క్రియేటివ్‌గా ఎలా ఆలోచిస్తారు అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్‌ దురోవ్‌. అయితే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ రంగంలో పనిచేసే పావెల్‌.. విజయ రహస్యం వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోతారు. 

Also Read: https://teluguprabha.net/top-stories/npci-to-launch-biometric-upi-for-faster-secure-transactions/

అయితే ఫోన్‌ను పక్కన పెట్టేసి హాయిగా నిద్రపోవడమే తన సక్సెస్‌ సీక్రెట్‌ అని పావెల్‌ దురోవ్‌ చెబుతున్నారు. తన డైలీ రొటీన్‌ గురించి ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. నిద్రకోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. 11 నుంచి 12 గంటలు నిద్రకే కేటాయిస్తానని.. అయితే అన్ని గంటలు నిద్రపోతానని కాదని ట్విస్ట్‌ ఇచ్చారు. బెడ్‌ మీద పడుకొని ఆలోచిస్తుంటానని.. అలా ఆలోచించే సమయం తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆ సమయంలో మంచి ఆలోచనలు వస్తుంటాయని దురోవ్‌ తెలిపారు.  

Also Read: https://teluguprabha.net/technology-news/moto-g06-power-launched-in-india-check-price-and-features/

నిద్ర లేవగానే ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్లు, సోషల్‌ మీడియా సంఘటనలు మన రోజును ప్రభావితం చేస్తుందని పావెల్‌ చెబుతున్నారు. అలా మన జీవితాన్ని ఒక వ్యక్తి గానీ సంస్థ కానీ డిసైడ్ చేయొద్దని అభిప్రాయపడ్డారు. ఫోన్‌ను పక్కన పెట్టేసి రోజూ మార్నింగ్‌ చేసే వ్యాయామం, రోజువారీ పనుల ద్వారా మనకు మంచి ఆలోచనలు వస్తాయని సూచిస్తున్నారు. టెక్నాలజీ, కనెక్టవిటీకి మద్దతు ఇస్తున్నా.. జీవితంలో ఏది ముఖ్యమో అది చేయాలని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad