Saturday, November 15, 2025
Homeబిజినెస్Paytm all-new app: పేటీఎం యాప్‌లో కొత్తగా ఏఐ ఫీచర్‌.. ఇకపై ప్రతి పేమెంట్‌పై ‘గోల్డ్‌...

Paytm all-new app: పేటీఎం యాప్‌లో కొత్తగా ఏఐ ఫీచర్‌.. ఇకపై ప్రతి పేమెంట్‌పై ‘గోల్డ్‌ కాయిన్’ పొందే అవకాశం..!

Paytm To Reward Users With Gold Coins On Every Transaction: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం తన యాప్‌ను పూర్తిగా రీడిజైన్ చేసింది. ఆధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో యాప్‌లో అదిరిపోయే లుక్‌తో తీర్చిదిద్దింది. యూజర్లకు మరింత వ్యక్తిగత, వేగవంతమైన పేమెంట్‌ సౌకర్యాలను అందించేందుకు ఈ మార్పులు చేసింది. కొత్త వెర్షన్‌లో 15కి పైగా కొత్త ఫీచర్లు, సులభంగా అర్థమయ్యే క్లీన్‌ ఇంటర్‌ఫేస్‌ తీసుకొచ్చింది. భారత యూజర్లతో పాటు 12 దేశాల ఎన్ఆర్ఐలకూ ఈ అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా తీసుకొచ్చిన మార్పులేంటో తెలుసుకుందాం.

- Advertisement -

ప్రతి పేమెంట్‌పై గోల్డ్‌ కాయిన్‌..

1. పేటీఎం యాప్‌లో మెయిన్‌ అట్రాక్షన్‌గా ‘గోల్డ్‌ కాయిన్స్‌’ పేరిట ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ కింద మీరు‌ చేసే ప్రతి చెల్లింపునకూ డిజిటల్‌ గోల్డ్‌ రూపంలో రివార్డు లభిస్తుంది.
2. యాప్‌ మొత్తం ఏఐ ఆధారంగా పని చేస్తున్నందున యూజర్లకు సంబంధించిన ఖర్చులను గుర్తించి, ఆటోమేటిక్‌గా డివైడ్‌ చేసుకోవచ్చు. ఏఐ ట్యాగ్‌లతో ఉన్న బాలన్స్‌ హిస్టరీ ఫీచర్‌ ద్వారా యూజర్లు అన్ని యూపీఐ ఖాతాల మొత్తాన్ని ఒకేసారి చూడొచ్చు.
3. షాపింగ్‌, బిల్స్‌, ట్రావెల్‌, యుటిలిటీస్‌ వంటి విభాగాలుగా ఖర్చులను విభజించడంతో పాటు బడ్జెట్‌ ప్లానింగ్‌కి ఈ కొత్త ఫీచర్‌ సహాయపడుతుంది.
4. హైడ్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ ద్వారా యూజర్లు తమ హిస్టరీలో కావాలనుకున్న ట్రాన్సాక్షన్లను సులభంగా హైడ్ చేసుకోవచ్చు.
5. డీటైల్డ్‌ యూపీఐ స్టేట్‌మెంట్‌లను ఎక్సెల్‌ లేదా పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పేమెంట్‌ సెర్చ్‌ ఫంక్షన్‌ పాత లావాదేవీలను వేగవంతంగా ఫిల్టర్‌ చేసేలా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.
6. అలాగే వినూత్నంగా పేటీఎం ప్లేబ్యాక్‌ ఫీచర్‌తో యూజర్‌ ఖర్చుల ఆధారంగా ఏఐ తయారు చేసిన రాప్‌ సాంగ్స్‌ వినిపించి, మనీ మేనేజ్‌మెంట్‌ను వినోదాత్మకంగా మార్చుతోంది.
7. మ్యాజిక్‌ పేస్ట్‌ ద్వారా వాట్సాప్‌ మెసేజ్‌లలో ఉన్న బ్యాంక్‌, ఐఎఫ్‌ఎస్‌సీ వివరాలు ఆటోమేటిక్‌గా పేస్ట్‌ అవుతాయి.
8. ఫేవరెట్ కాంటాక్ట్స్‌ ఫీచర్‌తో తరచూ చెల్లింపులు చేసే వారికీ త్వరగా డబ్బు పంపొచ్చు.
9. సులభంగా అందుబాటులో ఉండే విధంగా పేటీఎం యాప్‌లోనే క్యాలికులేటర్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
10. డాక్టర్లు, జిమ్‌ ట్రైనర్లు, క్యాబ్‌ డ్రైవర్లు వంటివారు రిసీవ్‌ మనీ విడ్జిట్‌ ద్వారా యాప్‌ ఓపెన్‌ చేయకుండానే హోమ్‌స్క్రీన్‌ నుంచే పేమెంట్ పొందొచ్చు.
11. కొత్త పేటీఎం స్కానర్‌ ఇప్పుడు ఆకర్షణీయమైన యానిమేషన్లు, ఏ కోణంలోనైనా స్కాన్‌ చేసే సౌకర్యం, తక్కువ వెలుతురులో ఆటో ఫ్లాష్‌లైట్‌, దూరం నుంచీ స్కాన్‌ చేయడానికి పించ్‌-టు-జూమ్‌ వంటి అత్యాధునిక ఫీచర్లతో వచ్చింది.
12. అంతేకాదు, 12 దేశాల ఎన్‌ఆర్‌ఐలు ఇప్పుడు తమ అంతర్జాతీయ మొబైల్‌ నంబర్లను ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ ఖాతాలకు లింక్‌ చేసి, రూపాయల్లో యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయం కలిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad