Personal Loan: విద్య, వైద్య, అత్యవసరఖర్చులకు పర్సనల్ లోన్లు తీసుకోవడం ఈ కాలంలో సులభతరంగా మారింది. అంతేకాకుండా, ఈ రోజుల్లో పర్సనల్ లోన్స్ పొందడం మరింత ఈజీగా మారిపోయింది. దీంతో, అందరూ వెంటనే రుణం తీసుకోగలుగుతున్నారు. డబ్బు నేరుగా వారి ఖాతాలో జమ అవుతోంది. అయితే ఆర్థిక నిపుణుల మాత్రం వ్యక్తిగత రుణాలు ఖరీదైనవని హెచ్చరిస్తున్నారు. ఇవి అధిక వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ప్రీ పేమెంట్ జరిమానాలు వంటి భారం కూడా కలిగిస్తాయంటున్నారు. ప్రజలు పర్సనల్ లోన్స్ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలని ఆర్థిక సలహాదారులు, నిపుణులు చెబుతున్నారు. అత్యవసర వైద్య అత్యవసరాలు, ఇంటి మరమ్మతులు లేదా ఆకస్మిక ఆర్థిక అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే పర్సనల్ లోన్‌కి వెళ్లటం సరైన నిర్ణయమని అంటున్నారు. పర్సనల్ లోన్ తీసకునేటప్పుడు ఈ ఐదు కచ్చితంగా పాటించాలని అంటున్నారు.
అవసరాలకు మించి అప్పుతీసుకోవడం..
అవసరాలకు మించి పర్సనల్ లోన్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ ఖర్చులు, గాడ్జెట్స్ కొనుగోలు, టూర్స్ వెళ్లటానికి లేదా పెళ్లి కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం తప్పని ఆర్థిక నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
నిబంధనలను అతిక్రమించడం
వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, కాలపరిమితి, తిరిగి చెల్లించే షెడ్యూల్‌లను కవర్ చేసే నిబంధనలు, షరలతులతో ప్రతి రుణం వస్తుంది. అయితే, ఛార్జీలు లేదా ముందస్తు చెల్లింపు జరిమానాలను విస్మరించడం వల్ల ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయి. కాబట్టి, రుణం తీసుకునే ముందు ఆ నిబంధనలు చదవి అర్థం చేసుకోండి. అందుకే రుణ ఒప్పందంలోని ప్రతి షరతును జాగ్రత్తగా చదవడం, అవసరమైనప్పుడు మాత్రమే ఈ రుణాన్ని పొందటం మంచిదని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు
వడ్డీ రేట్లను పట్టించుకోకపోవడం
వడ్డీ రేట్లలో చిన్న వ్యత్యాసం కూడా రుణం తిరిగి చెల్లించే మొత్తంలో భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు. రుణం మొత్తం లేదా కాలపరిమితిపై మాత్రమే దృష్టి పెడతారు. అయితే, ఇది దీర్ఘకాలంలో అధిక ఖర్చులకు దారితీస్తుంది. లోన్ తీసుకునే ముందు ఏజెంట్లపైనే పూర్తిగా ఆధారపడవద్దు. ఇతర వడ్డీ రేట్లను పోల్చడం అవసరం. అత్యంత పోటీతత్వ రేట్లను జాగ్రత్తగా మూల్యాంకనం చేయడం ద్వారా గణనీయమైన మొత్తంలో డబ్బును ఆదా చేయవచ్చు. అంతేకాకుండా, అనవసరమైన ఆర్థిక ఒత్తిడిని నివారించవచ్చు.
Read Also: Triangle Love Story: ముక్కలైన కళ్యాణ్ గుండె.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లేనా?
బహుళ వనరుల నుండి రుణాలు తీసుకోవడం
ఒకేసారి బహుళ రుణాలు తీసుకోవడం ప్రమాదకరం. ఇలా లోన్లు తీసుకున్నప్పుడు రుణ భారం అధికమవుతుంది. జాగ్రత్తగా ప్రణాళిక లేకుండా వ్యక్తిగత రుణాలు తీసుకున్నప్పుడు, వారు వారి ఆదాయాన్ని మించి చెల్లించే ఒత్తిళ్లను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఫలితంగా ఆర్థిక ఒత్తిడి, సంభావ్య డిఫాల్ట్‌లు ఏర్పడతాయి. అందుకే, ఒకేసారి బహుళ వనరుల నుంచి రుణాలు తీసుకోవద్దు.
సమయానికి లోన్ లేదా ఈఎంఐలు చెల్లించకపోవడం
సకాలంలో మీ EMI చెల్లింపులు చేయకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఆలస్య చెల్లింపు జరిమానాలు, అదనపు వడ్డీ ఛార్జీలను ఎదుర్కోవడమే కాకుండా, క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. భవిష్యత్ లో రుణాలు పొందడం కష్టంగా మారుతోంది. ఒక్కోసారి సకాలంలో చెల్లించకపోవడం వల్ల రుణదాతలు చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి రావచ్చు. అలాగే క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నవారు రుణం తీసుకుంటే అధిక వడ్డీ రేటు భారం మోసే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల కోసం రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని మరీమరీ హెచ్చరిస్తున్నారు. అనవసరమైన లగ్జరీ లేదా ఆడంబరాలకు పోయి చేసే ఖర్చుల కోసం లోన్స్ తీసుకుంటే ఆర్థికంగా జీవితాలు భారంగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా నేటి కాలంలో చాలా మంది చేస్తున్న పెద్ద తప్పే అనవసరమైన వాటి కోసం లోన్స్ తీసుకోవటం అందుకే పైన విషయాలను గమనించి ముందుకెళ్లాలి.
Read Also: Bigg Boss New Captain: కొత్త కెప్టెన్ గా రాము రాథోడ్..!


