Saturday, November 15, 2025
Homeబిజినెస్Personal Loan: అర్జెంటుగా డబ్బులు కావాలా?.. అయితే, ఈ యాప్స్‌ పర్సనల్ లోన్ ట్రై చేయండి

Personal Loan: అర్జెంటుగా డబ్బులు కావాలా?.. అయితే, ఈ యాప్స్‌ పర్సనల్ లోన్ ట్రై చేయండి

Personal Loan in Banks and Apps: అర్జెంట్‌గా డబ్బులు కావాలంటే.. పర్సనల్‌ లోన్‌ మాత్రమే మంచి ఆప్షన్‌. ఇతర లోన్లతో పోలిస్తే పర్సనల్‌ లోన్లు సులభంగా లభిస్తాయి. పేపర్‌ వర్క్, డాక్యుమెంటేషన్‌ లేకుండా సులభంగా పర్సనల్‌ లోన్లు లభిస్తాయి. అయితే, పర్సనల్‌ లోన్‌ తీసుకునే సమయంలో అనేక నియమ నిబంధనలు చెక్ చేసుకోవాలి. ఆర్‌బీఐ అప్రూవ్ చేసిన యాప్స్ లో మాత్రమే లోన్ తీసుకోవాలి. బ్యాంకులు మాత్రమే కాకుండా కొన్ని ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ కూడా పర్సనల్‌ లోన్లు ఆఫర్‌ చేస్తున్నాయి. దరఖాస్తు చేసిన వెంటనే ఫోన్‌లోనే కెవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది. మీ ప్రొఫైల్ ఎలిజిబుల్ అయితే నిమిషాల్లోనే అమౌంట్‌ క్రెడిట్‌ అవుతుంది. అయితే, వీటితో కొన్ని మంచి యాప్స్‌, మరికొన్ని ఫేక్ యాప్స్‌ కూడా ఉంటాయి. కొన్ని ఫేక్ యాప్స్ అధిక వడ్డి వసూలు చేయడంతో పాటు రీపేమెంట్ కోసం కాల్స్ చేసి వేధిస్తుంటారు. అందుకే లోన్ యాప్స్ ఎంచుకునేముందు ఆర్‌‌బీఐ ఆమోదం పొందిందా? లేదా? అనేది చెక్‌ చేసుకోవాలి. అలాంటి యాప్స్ గురించి తెలుసుకుందాం.

- Advertisement -

ఆదిత్యా బిర్లా క్యాపిటల్

ఆదిత్యా బిర్లా క్యాపిటల్ అనేది ఆర్‌‌బీఐ అప్రూవ్డ్ ఫైనాన్స్ సంస్థ. ఈ యాప్ ద్వారా సులభంగా లోన్ లభిస్తుంది. పర్సనల్‌ లోన్‌లో వార్షిక వడ్డీ 10.99% నుంచి మొదలవుతుంది. ఈఎంఐ 12 నెలలకు మించి టెన్యూర్ పెట్టుకుంటే వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉంది. సిబిల్ స్కోరు 650కు పైనా ఉంటే ఈజీగా లోన్ అప్రూవ్ అవుతుంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ యాప్ ద్వారా కూడా సులభంగా పర్సనల్ లోన్ పొందొచ్చు. ఇందులో 9.99 శాతం వడ్డీ రేటుతో లోన్ లభిస్తుంది. లోన్ రీపేమెంట్ టైం 9 నెలల నుంచి గరిష్టంగా 60 నెలల వరకూ పెట్టుకోవచ్చు. సిబిల్ స్కోరు 650 ఉంటే ఈజీగా లోన్ అప్రూవ్ అవుతుంది.

క్రెడిట్ బీ

క్రెడిట్ బీ కూడా ఆర్‌‌బీఐ అప్రూవ్డ్ లోన్ యాప్స్‌లో ఇది ఒకటి. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి కూడా ఇందులో ఈజీగా లోన్ లభిస్తుంది. అయితే, ఇందులో వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. వార్షిక వడ్డీ సుమారు 12 శాతం నుంచి మొదలవుతుంది. లోన్ టెన్యూర్ 6 నెలల నుంచి 60 నెలల వరకు పెట్టుకోవచ్చు.

మనీ వ్యూ

మనీ వ్యూ యాప్‌లో కూడా ఈజీగా లోన్ లభిస్తుంది. ఇందులో మీ ఎలిజిబిలిటీ, సిబిల్‌ స్కోర్‌ని బట్టి రూ. 10 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందొచ్చు. 3 నుంచి 60 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. వార్షిక వడ్డీ 14 శాతం నుంచి మొదలవుతుంది.

స్టాష్‌ఫిన్

తక్కువ మొత్తంలో లోన్‌ కావాలంటే స్టాష్‌ఫిన్ అనే యాప్‌లో ట్రై చేయొచ్చు. ఇందులో రూ.5 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అలాగే 30 రోజుల్లో చెల్లిస్తే వడ్డీ కూడా ఉండదు. ఒకవేళ నాలుగేళ్లకు ఈఎంఐ పెట్టుకుంటే 11.99 శాతం వార్షిక వడ్డీ ఉంటుంది. అయితే, పర్సనల్‌ లోన్‌ తీసుకునేముందు వడ్డీ రేట్లు ఇంకా అదనపు ఛార్జీల గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే లోన్ యాప్స్ లో లోన్ తీసుకునే ముందు నియమ నిబంధనలు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు సలహాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad