PhonePe News: ఫోన్ పే, గూగుల్ పే వంటి పెద్ద యూపీఐ ఫిన్‌టెక్ కంపెనీలు ఇండియాలో ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నప్పటికీ.. తాజా గణాంకాల మాత్రం వాటి మార్కెట్ షేర్ తగ్గుదలను సూచిస్తోంది. ఇక కొత్త ప్లేయర్లు Navi, super.money, BHIM తదితరులు శరవేగంగా కొత్త కస్టమర్లను పెంచుకుంటూ తమ మార్కెట్ షేర్ పెంచుకుంటున్నట్లు వెల్లడైంది.
2024 జనవరిలో PhonePe, Google Pay, Paytm కలిసి యూపీఐ ట్రాన్సాక్షన్లలో 95.2% వాటాను హోల్డ్ చేశాయి. కానీ 2025 జూలై నాటికి ఇది 88.3%కి పడిపోయింది. ఫోన్ పే తన మార్కెట్‌షేర్ గత ఏడాది 2.6% కోల్పోగా.. గూగుల్ పే కూడా సుమారు 1.5% కోల్పోయింది. అయినప్పటికీ ఈ రెండు ఒకదానికొకటి కలిపి ఇప్పటికీ 80% మార్కెట్ షేర్ కలిగి ఉన్నాయి. అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వచ్చిన నావీ, సూపర్ మనీలు కస్టమర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. దీంతో నావీ ప్రస్తుతం 1.4%, super.money 0.7% మార్కెట్‌షేర్ ను సంపాదించాయి.
Ap Local Body Elections: ఏపీలో ఈవీఎంలతో స్థానిక సంస్థల ఎన్నికలు
మోనోపొలీని నిరోధించేందుకు ఒక యాప్‌కు 30% కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్స్ మోతాదును అనుమతించరాదని నియంత్రణలు ఉన్నాయి. కానీ దీని అమలును 2 సంవత్సరాలు వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త ఫిన్‌టెక్ కంపెనీలు రూపే క్రెడిట్ కార్డ్స్, క్యాష్‌బ్యాక్, రివార్డ్స్ వంటి కొత్త ప్రయోజనాలతో యూపీఐ యాప్‌ల మార్కెట్లో అడుగులు పెట్టాయి. భారతదేశంలో నెలకు యూపీఐ పేమెంట్స్ ద్వారా 2000 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతుండగా.. ఇప్పటికీ ఫోన్‌పే, గూగుల్ ఎక్కువగా ప్రజాధరణను పొందుతున్నాయి. మరో పక్క NPCI తరఫున పోటీ పెంచేందుకు అనేక చర్యలు కొనసాగుతున్నాయి.


