Homeబిజినెస్Post Office Scheme: అద్భుతమైన పోస్టాఫీస్ స్కీమ్.. నెలకు చేతికి లక్షల రూపాయలు

Post Office Scheme: అద్భుతమైన పోస్టాఫీస్ స్కీమ్.. నెలకు చేతికి లక్షల రూపాయలు

Post Office PPF Scheme : డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే, ఆ సంపాదించిన డబ్బును సురక్షితంగా దాచుకుని, లాభదాయకమైన రాబడి పొందడం మరో ఎత్తు. ప్రస్తుత రోజుల్లో మార్కెట్ రిస్క్ లేకుండా, కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో భారీ లాభాలను అందించే పథకాల కోసం చూస్తున్నారా? అయితే మీకు పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక వరం లాంటిది. చాలామంది బ్యాంకుల్లో కంటే పోస్టాఫీసుల్లో పెట్టుబడి పెట్టడానికే మొగ్గు చూపుతారు. దానికి కారణం ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడం, మీ సొమ్ముకు 100% భద్రత ఉండటం.

- Advertisement -

 

iPhone 15 : ఐఫోన్‌ 15 కేవలం రూ.36 వేలకే..!

బ్యాంకులతో పోలిస్తే ఇక్కడ వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది అనేక బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైనది. ఇందులో మీరు పొందే వడ్డీపై రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు. అలాగే సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు.మీరు ఏడాదికి కనీసం రూ. 500 తో ఈ అకౌంట్ ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పొదుపు చేయవచ్చు.

ఈ పథకం కాలపరిమితి 15 ఏళ్లు. అంటే ఇది దీర్ఘకాలిక అవసరాల కోసం (పిల్లల చదువులు, పెళ్లిళ్లు లేదా రిటైర్మెంట్) అద్భుతమైన మార్గం. 5 ఏళ్లు పూర్తయిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో (అనారోగ్యం లేదా ఉన్నత చదువులు) కొంత సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు లేదా అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. అకౌంట్ ప్రారంభించిన ఏడాది తర్వాత మీ బ్యాలెన్స్‌పై తక్కువ వడ్డీకే లోన్ పొందే వెసులుబాటు కూడా ఉంది. 15 ఏళ్ల తర్వాత కూడా మీకు డబ్బు అవసరం లేకపోతే, మరో 5 ఏళ్ల చొప్పున ఎంత కాలమైనా పొడిగించుకోవచ్చు.

రూపాయి రూపాయి కూడబెట్టి లక్షాధికారి కావాలనుకునే మధ్యతరగతి ప్రజలకు PPF ఒక గొప్ప ఆయుధం. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, చక్రవడ్డీ మహిమతో మీ పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశం ఈ పథకంలో ఉంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News