Saturday, November 15, 2025
Homeబిజినెస్Post Office: పెట్టుబడి రూ.333.. రాబడి రూ.17 లక్షలు

Post Office: పెట్టుబడి రూ.333.. రాబడి రూ.17 లక్షలు

Post Office Scheme: భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలంటే ఈరోజుల్లో పొదుపు ఖచ్చితంగా అవసరం. ఈ కాలంలో అనేక రకాలుగా పొదుపు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో వీటికి సంబంధించిన సంస్థలు చాలానే వచ్చాయి. సంస్థని బట్టి పథకాలు ఉంటాయి. ఇటువంటి వాటిలో కేంద్ర రంగం సంస్థ అయిన పోస్ట్ ఆఫీస్ రికవరింగ్ డిపాజిట్ (ఆర్డీ) పథకం అందిస్తుంది. ఈ ఆర్డీ పథకంలో రోజుకు రూ.333 చెల్లిస్తే పదేళ్ల తరువాత రూ.17 లక్షలు పొందవచ్చు.

- Advertisement -

తక్కువ సమయంలో మంచి లాభాలు చేతికి రావాలనుకునే వారికి ఈ ఆర్డీ స్కీమ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇక ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తానికి ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. రింగ్ డిపాజిట్ స్కీమ్‌ అనేది ఒక ప్రత్యేకమైన టర్మ్‌ డిపాజిట్ పాలసీ. దీనిని ఐదు సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.

Readmore: https://teluguprabha.net/business/gold-and-silver-prices-dropped-continuously-2nd-also-after-record-break-1-lakh-on-10-grams/

పోస్ట్ ఆఫీస్ ఈ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ లో నెలకు రూ. 100 పెట్టుబడి పెట్టడం ద్వారా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇందులో సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసే సౌకర్యం కూడా ఉంది. పోస్టాఫీసులోని అన్ని పథకాలు రిస్క్ లేనివి. ఆర్‌డీ పెట్టుబడిలో ఎలాంటి రిస్క్ ఉండదు. ఇందులో ప్రతి నెల సరైన సమయంలో పెట్టుబడి చెల్లించాలి. ఆలస్యం అయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వరుసగా నాలుగు నెలలు చెల్లించకుండా ఉన్నట్లయితే అకౌంట్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది.

Readmore: https://teluguprabha.net/business/tcs-lays-off-12000-employees/

రోజుకు రూ.333 చెల్లించటం ద్వారా నెలకు రూ.10,000 జమ అవుతుంది. అంటే సంవత్సరానికి రూ.1.20 లక్షలు అకౌంట్ లో ఉంటాయి. ఈ ఆర్డీ మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు కాబట్టి అప్పటి వరకు రూ.6 లక్షలు జమ అవుతాయి. వీటిపై వడ్డీ 6.7 శాతం ఉంటుంది కాబట్టి మొత్తం అమౌంట్ రూ.7,13,659 చేతికి వస్తాయి. ఇది మరో 5 సంవత్సరాలు కొనసాగిస్తే రూ.17,08,546 రాబడి తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad