Saturday, November 15, 2025
Homeబిజినెస్Prada Safety Pin: ప్రాడా సేఫ్టీ పిన్ ధర రూ. 69,000.. దానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలేమో...

Prada Safety Pin: ప్రాడా సేఫ్టీ పిన్ ధర రూ. 69,000.. దానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలేమో అని నెటిజన్ల చురకలు

Prada Sells a Rs 69,000 Safety Pin: విలాసవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రాడా’ (Prada) ఎప్పుడూ తన ఖరీదైన వస్తువులతో వార్తల్లో ఉంటుంది. కానీ ఈసారి, వారు అమ్మకానికి పెట్టిన ఒక వస్తువు, దాని ధర చూసి జనాలు అవాక్కవ్వడమే కాదు, తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వస్తువు ఏంటో తెలుసా? ఒక మామూలు సేఫ్టీ పిన్ (Safety Pin).

- Advertisement -

ALSO READ: Flying Cars: టెస్లాకు భారీ షాక్.. ఫ్లయింగ్ కార్ల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించిన చైనా కంపెనీ Xpeng!

ఏముంది ఆ పిన్‌లో?

ఈ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్, ఒక మెటల్ సేఫ్టీ పిన్ బ్రూచ్‌ను (చొక్కాకు తగిలించుకునే పిన్) అమ్మకానికి పెట్టింది. దీని ధర అక్షరాలా $775 (సుమారు రూ. 69,000). ఈ పిన్‌కు వజ్రాలు లేదా రత్నాలు ఏమీ పొదగలేదు. ఇది కేవలం ఒక బంగారు రంగు సేఫ్టీ పిన్, దానికి రంగురంగుల ఉన్ని దారాలు చుట్టి, చివర్లో ఒక చిన్న ‘ప్రాడా’ లోగో చార్మ్‌ను తగిలించారు.

సాధారణంగా మన ఇళ్లలో సేఫ్టీ పిన్‌లు దేనికి వాడతాం? చీర కుచ్చులు సరిచేయడానికి, లేదా దుస్తుల సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించుకోవడానికి. పది, ఇరవై రూపాయలకే డజన్ల కొద్దీ పిన్‌లు వస్తాయి. చాలా మంది భారతీయ మహిళలు, ముఖ్యంగా అమ్మమ్మలు, తమ గాజులకు ఒక సేఫ్టీ పిన్‌ను తగిలించుకోవడం మనం చూస్తూనే ఉంటాం.

ALSO READ: Used EV Cars: రెండేళ్లలో 42 శాతం విలువ కోల్పోతున్న ఈవీలు.. రీసేల్ వాల్యూపై ఓనర్లలో ఆందోళన, సమస్య ఇదే..

ప్రాడాపై ఇంటర్నెట్ చురకలు

అలాంటిది, కేవలం దారాలు చుట్టిన పిన్‌కు రూ. 69,000 ధర పెట్టడంతో నెటిజన్లు ప్రాడాను ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఒక ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉత్పత్తిని ఎగతాళి చేస్తూ, “డబ్బున్న వాళ్లు మీ డబ్బుతో ఏం చేస్తున్నారో దయచేసి చెప్పండి. మీకు ఆలోచనలు రాకపోతే, మాకు చెప్పండి, మా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.

 

View this post on Instagram

 

A post shared by BlackSwanSazy (@blackswansazy)

మరొక యూజర్, “ఇది నేను కూడా చేయగలను??” అని కామెంట్ చేయగా, ఇంకొక యూజర్ ఇచ్చిన కామెంట్ హైలైట్‌గా నిలిచింది: “మా అమ్మమ్మ దీనికంటే చాలా బాగా చేస్తుంది” (My grandma could do it better) అని రాశారు.

ఈ పిన్‌ను కొనాలంటే, దానికి కూడా యాపిల్ కేర్ లాగా ఇన్సూరెన్స్ తీసుకోవాలేమో అని కొందరు చురకలు అంటిస్తున్నారు. ఈ విమర్శల దెబ్బకో ఏమో, ప్రస్తుతం ప్రాడా వెబ్‌సైట్‌లో ఈ ఉత్పత్తి లింక్ పనిచేయడం లేదని సమాచారం.

ALSO READ: Gopichand Hinduja: బ్రిటన్ కుబేరుడు గోపీచంద్ హిందూజా కన్నుమూత.. బోఫోర్స్ నుంచి కుటుంబ వివాదాల వరకు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad