Friday, December 12, 2025
Homeబిజినెస్RBI on Junio Payments: బ్యాంక్ అకౌంట్ లేకుండా పిల్లలకు డిజిటల్ పేమెంట్స్.. రిజర్వు బ్యాంక్...

RBI on Junio Payments: బ్యాంక్ అకౌంట్ లేకుండా పిల్లలకు డిజిటల్ పేమెంట్స్.. రిజర్వు బ్యాంక్ కొత్త సౌకర్యం

RBI UPI wallet for kids: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్‌ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. దీని ప్రకారం పిల్లలు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేకుండానే UPI ఆధారిత డిజిటల్ వాలెట్‌ను ఉపయోగించి చెల్లింపులు చేయగలిగే అవకాశాన్ని తీసుకొస్తోంది. ఈ నిర్ణయం ద్వారా పిల్లల ఆర్థిక అవగాహన, డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెరిగే అవకాశం ఎక్కువ కానుంది.​

- Advertisement -

ఈ జూనియో యాప్ వాలెట్ ఎలా పనిచేస్తుంది?
రిజర్వు బ్యాంక్ అనుమతి ఇచ్చిన Junio Payments వంటి ఫిన్‌టెక్ సంస్థలు పిల్లలకు ప్రీపెయిడ్ వాలెట్లను జారీ చేస్తాయి.​తల్లిదండ్రులు తమ ఖాతా ద్వారా పిల్లల వాలెట్‌కు డబ్బు జమ చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. దీనికోసం పిల్లల పేరుపై ఎలాంటి బ్యాంక్‌ ఖాతా అవసరం ఉండదు. UPI ద్వారా పిల్లలు QR కోడ్‌ను స్కాన్ చేసి చిన్న మొత్తాల్లో చెల్లింపులు చేసేయెుచ్చు. అలాగే పిల్లల ప్రతి లావాదేవీపై తల్లిదండ్రులకు నోటిఫికేషన్‌ వస్తుంది. అలాగే ఖర్చులపై పూర్తిగా నియంత్రణ ఉంటుంది.​​

కొత్త నిర్ణయంతో వచ్చే ప్రయోజనాలు..
పిల్లల్లో ఆర్థిక అవగాహన పెరగి.. వారి ఖర్చులను ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు. డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితంగా, నిశ్చితంగా ఉండేలా RBI, NPCI నియంత్రణ వ్యవస్థను సామర్ధ్యం చేస్తోంది. పిల్లలు తమ చిన్న వయసులోనే డిజిటల్ పేమెంట్, బడ్జెట్, సేవింగ్స్ లాంటి అంశాల్లో అనుభవం పెంచుకోగలరు. ఇందుకోసం తల్లిదండ్రులు ముందుగా జూనియో యాప్ వంటి అప్లికేషన్లలో కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది ముందుగా. అప్పుడే ఖాతా యాక్టివేట్ అయ్యి డబ్బు జమ చేసేందుకు వీలు కల్పించబడుతుంది. ఖర్చుల లిమిట్‌ను కూడా తల్లిదండ్రులు సెట్ చేయొచ్చు.

ఇలాంటి చైల్డ్ ఫ్లెండ్లీ టెక్నాలజీలు తల్లిదండ్రులకు తమ పిల్లల ఖర్చులు, వారి అలవాట్లపై కూడా అవగాహనను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. పైగా డబ్బు భౌతికంగా కలిగి ఉండటం కంటే ఇలా క్యారీ చేయటం పిల్లలకు కూడా సేఫ్ అని అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News