RBI Loans: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్లు తీసుకున్న వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. చిన్న చిన్న వ్యాపార అవసరాలకు, సూక్ష్మ సంస్థలు తీసుకున్న లోన్లను ముందుగా చెల్లిస్తే వాటిపై విధించే ప్రీ‑పేమెంట్ లేదా ఫోర్లోజర్ ఛార్జీలు రద్దు చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని బ్యాంకులకు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ సరికొత్త నియమం జనవరి 1వ తేదీ 2026 నుంచి అందుబాటులోకి రానుంది. కొత్తగా తీసుకునే రుణాలు లేదా రెన్యూవల్ రుణాలపై కూడా ఇది వర్తిస్తుంది.
ఈ నిర్ణయం వల్ల వ్యక్తిగత వ్యాపార అవసరాలు ఉన్న వ్యక్తులు, MSEలు తీసుకునే వారికి మేలు జరగనుంది. సుమారు ₹7.5 కోట్ల వరకు తీసుకున్న MSE రుణాలకు ఇది వర్తిస్తుంది . ఇప్పటికే కొన్ని బ్యాంకులు, చిన్న ఆర్థిక సంస్థలు ₹50 లక్షలకు దిగువ రుణాలపై ముందే ప్రీ‑పేమెంట్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇప్పుడు ఈ పరిధిని పెంచి అన్ని కంపెనీలు, బ్యాంకులు, NBFCలకు ఈ విధానాన్ని వర్తింపజేసింది.
RBI ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
విభిన్న విధానాలు: రుణదాతలచే వర్తించే విధానాలు అన్ని బ్యాంకుల్లో ఒకే విధంగా లేకపోవడంతో పాటు కొన్ని వేరే విధంగా ఉన్నాయి. దీని కారణంగా వినియోగదారులు నష్టపోవడంతో పాటు వారిలో అపనమ్మకం కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భారాన్ని తగ్గించుకునేందుకు వేరే బ్యాంకుకు మారడం, దాని వలన కలిగే చార్జీలు భరించడం వంటివి తగ్గించాలని RBI భావించింది. ఈ నియమాలు 2026 జనవరి 1వ తేదీ నుంచి వర్తించనుండగా.. అప్పటి వరకు బ్యాంకులు పాత విధానాన్నే కొనసాగించనున్నాయి.