RBI Currency Update: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) దేశంలోని నగదు వ్యవస్థను నియంత్రించే ప్రధాన సంస్థ. మన చేతిలో తిరిగే ప్రతి నోటు నాణ్యత, భద్రత, ముద్రణ ప్రమాణాలు అన్నీ ఇదే నిర్ణయిస్తుంది. నకిలీ నోట్లను అడ్డుకోవడం, నోట్లు ఎక్కువకాలం ఉపయోగపడేలా చేయడం, ప్రజలకు నమ్మకమైన కరెన్సీ అందించడం ఆర్‌బీఐ ప్రధాన బాధ్యత. అందుకే కాలానుగుణంగా నోట్లలో చిన్న చిన్న సాంకేతిక మార్పులు చేస్తూ వస్తుంది. ఇదంతా సరే అసలు పాయింట్ కి రా అంటారా..ఈ మధ్య సోషల్ మీడియాలో నోట్ల గురించి జరుగుతున్న ప్రచారం గురించి. వాటి గురించి ఒక లుక్ వేద్దాం పదండి మరి.
2026 కరెన్సీ అప్‌డేట్
ఈ మధ్య సోషల్ మీడియాలో రూ.100 రూ.500 నోట్ల గురించి అనేక రకాల వార్తలు తిరుగుతున్నాయి. నోట్లు రద్దు, మార్చుకోవాలి, డెడ్‌లైన్ వచ్చింది అంటూ భయపెట్టే పోస్టులు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే 2026 కరెన్సీ అప్‌డేట్ అనేది డీమోనిటైజేషన్ కాదు. పాత నోట్లు రద్దు కూడా కాదు. రోజూ ఎక్కువగా వినియోగంలో ఉండే ఈ రెండు నోట్ల భద్రత, మన్నిక పెంచడానికే చేసిన సాధారణ అప్‌డేట్ మాత్రమే.
రూ.100 నోట్ విషయానికి వస్తే…
డిజైన్ మారలేదు. అదే లుక్ కొనసాగుతుంది. కానీ ప్రింట్ స్పష్టత పెంచారు. ఇంక్ క్వాలిటీ స్ట్రాంగ్‌గా చేశారు. ఎక్కువ మడతలు పడినా అక్షరాలు త్వరగా మసకబారకుండా చేశారు. వాటర్‌మార్క్, సెక్యూరిటీ థ్రెడ్ ఇంకా క్లియర్‌గా కనిపించేలా అప్‌డేట్ చేశారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా నోట్ అసలుదేనా కాదా సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే నోట్ జీవితాన్ని పెంచడం కూడా ఈ మార్పుల ప్రధాన లక్ష్యం.
Read Also: Lava New Phone: అమెజాన్‌లో సందడి చేస్తున్న లావా బోల్డ్ N2.. ధర కూడా జస్ట్ రూ.6వేల లోపే
రూ.500 నోట్ గురించి చూస్తే…
రూ.500 విలువ ఎక్కువ కావడంతో ఇది నకిలీ ముఠాల టార్గెట్‌గా మారే అవకాశం ఉంటుంది. అందుకే మైక్రో ప్రింటింగ్ మరింత షార్ప్‌గా చేశారు. డిజైన్ ఎలిమెంట్స్ అలైన్‌మెంట్ మెరుగుపరిచారు. కలర్ కన్సిస్టెన్సీ పెంచారు. ఇవన్నీ కలిపి నకిలీ నోట్లు తయారు చేయడం కష్టంగా మారుతుంది. రూపం మాత్రం మారలేదు. ఏటీఎం మెషీన్లు, క్యాష్ కౌంటింగ్ మెషీన్లు పాతవి కొత్తవి రెండింటినీ స్వీకరించేలా ఇప్పటికే సెట్ చేశారు.
గుర్తుంచుకోవాల్సింది విషయానికి వస్తే..
మీ దగ్గర ఉన్న పాత రూ.100 రూ.500 నోట్లు పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయి. బ్యాంక్‌కి వెళ్లి తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం లేదు. పాడైనవి, చిరిగిపోయినవే సాధారణ నిబంధనల ప్రకారం మాత్రమే మారుస్తారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా, అనుమానాస్పద నోట్ దొరికితే దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్‌కి ఇవ్వాలి. మొత్తానికి ఈ అప్‌డేట్ మీ డబ్బుపై ప్రభావం చూపదు… ప్రశాంతంగా రోజువారీ లావాదేవీలు కొనసాగించవచ్చు.

