Sunday, November 16, 2025
Homeబిజినెస్RBI Governor: యూపీఐ యూజర్లకు బిగ్ షాక్..

RBI Governor: యూపీఐ యూజర్లకు బిగ్ షాక్..

UPI: ప్రస్తుతం ఎక్కడ చూసిన, ఏ చిన్న అవసారికైనా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు సర్వసాధారణం అయింది. దగ్గరలో ఉన్న కిరాణ దుకాణం దగ్గరి నుండి మాల్స్, రెస్టారెంట్స్, ప్రభుత్వ కార్యాలయాలలో, ఆర్టీసీ బస్సులలో ఎక్కడ చూసిన యూపీఐ పేమెంట్స్ కనిపిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ పే, పేటీఎమ్.. ఇలా ఏదొక మాధ్యమం ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.

- Advertisement -

డిజిటల్ పేమెంట్స్‌లో భారత్ ముందు వరుసలో ఉంది. యూపీఐ చెల్లింపులలో నిరంతరం కొత్త రికార్డులను సృష్టిస్తుంది. గత రెండేళ్లలో ఈ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఏకంగా 30 కోట్ల చెల్లింపుల నుండి 60 కోట్ల చెల్లింపులకు ఎగబాకాయి. అవి కేవలం ఒక్క రోజు చెల్లింపులు మాత్రమే..!

Readmore: https://teluguprabha.net/business/nissan-magnite-scores-5-star-safety-in-global-ncap-check-crash-test-results-here/

ప్రస్తుతం నగదు రూపంలో చెల్లించడం చాలా అరుదుగా మారింది. గతంలో యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు వేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కేవలం ప్రచారమేనని అందులో నిజం ఏమి లేదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా యూపీఐ చెల్లింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత యూపీఐ చెల్లింపులు త్వరలో ముగిసిపోవచ్చని తెలిపారు. యూపీఐ సేవలు నిరంతరాయంగా అందించేందుకు బ్యాంకులు, థర్డ్ పార్టీ సంస్థలు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను నిర్వహిస్తున్నాయని చెప్పారు. యూపీఐ వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే కస్టమర్లు కొన్ని ఛార్జీలను భరించాలని చెప్పారు.

Readmore: https://teluguprabha.net/business/sundar-pichai-joins-billionaire-club-net-worth/

అయితే ఈ విషయంలో ఇప్పుడు ఎటువంటి మార్పు ఉండదని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఖర్చులను కేంద్రమే భరిస్తుందన్నారు. యూపీఐ సేవలను ఉచితంగానే అందించాలనే ఆలోచనలో కేంద్రం ఉందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad