Sunday, July 13, 2025
Homeబిజినెస్Real estate India : రియల్ ఎస్టేట్ రంగానికి రానుంది స్వర్ణయుగం

Real estate India : రియల్ ఎస్టేట్ రంగానికి రానుంది స్వర్ణయుగం

Real estate updates : భారతీయ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం మందకొడిగా సాగుతోంది. అయితే ఇది అభివృద్ధి దశలో ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వృద్ధి దశ వచ్చే 2 నుండి 3 సంవత్సరాల పాటు కొనసాగే అవకాశముందని వారు చెబుతున్నారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌కు చెందిన రోనాల్డ్ సియోని తాజాగా ఇటి నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ అభివృద్ధి దశ ప్రస్తుతం మూడో లేదా నాలుగో ఏడాదిలో ఉందని తెలిపారు. ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులు, పెద్ద స్కేల్ లాంచ్‌లు ఈ ట్రెండ్‌కు ప్రధాన డ్రైవింగ్ ఫ్యాక్టర్లు అని అన్నారు. గతంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇబ్బంది పెట్టిన ప్రధాన సమస్య, అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు (ఇన్వెంటరీ బ్యాక్‌లాగ్). అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని సూచనలున్నాయి. సియోని అభిప్రాయం ప్రకారం, ఇన్వెంటరీ బ్యాక్‌లాగ్ ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. మొదటి త్రైమాసికంలో కొన్ని నివేదికల ప్రకారం గృహ విక్రయాలు కొంత మందగించాయి కానీ, ఇది మొత్తం మార్కెట్‌ను ప్రతినిధ్యం చేయదని అన్నారు. ‘అఫోర్డబుల్ హౌసింగ్’ సెగ్మెంట్ కొంత మందగించిందని, కానీ DLF, ఒబెరాయ్ రియాల్టీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే తమ దృష్టిని ప్రీమియం, లగ్జరీ సెగ్మెంట్లపై కేంద్రీకరించాయి.

- Advertisement -

ప్రీమియం ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది

రీసెంట్‌గా ప్రారంభమైన ప్రాజెక్టులకు గణనీయమైన ఆదరణ లభించింది. ఉదాహరణకు, ఓబెరాయ్ గోరేగావ్ ప్రాజెక్ట్, DLF ప్రివానా నార్త్, గోద్రేజ్ కొత్త లాంచ్‌లు మొదటి త్రైమాసికంలోనే మంచి అమ్మకాలు సాధించాయి. ఈ వృద్ధి కొనసాగితే, ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్ రాబోయే త్రైమాసికాల్లో మరింత దూసుకుపోయే అవకాశముంది.

వృద్ధి మరిన్ని సంవత్సరాలు కొనసాగుతుందా?

కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అప్‌సైకిల్ కనీసం దశాబ్దకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. చిన్న డెవలపర్లకు రాబోయే రోజు మెరుగ్గా ఉంటాయని, దాదాపు 20–30 శాతం ప్రీ-సేల్స్ వృద్ధి సాధించే అవకాశముంది. పెద్ద కంపెనీలు అంత అధిక వృద్ధి రేట్లు సాధించలేకపోయినా, స్థిరమైన ప్రోగ్రెస్ కొనసాగుతుంది. దీంతోపాటు, కొత్త ప్రాజెక్టులు, మార్కెట్ డిమాండ్ తదితర అంశాలు వృద్ధిని మరింత బలపరుస్తున్నాయి.

పెట్టుబడులకు మంచి సమయం

ఈ రంగంలో పెట్టుబడి పెట్టదలచిన వారు, ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. రోనాల్డ్ సియోని సూచించిన కొన్ని కంపెనీలు చూస్తే, లార్జ్‌క్యాప్స్ లో DLF, ఒబెరాయ్ రియాల్టీ, ఫీనిక్స్ మిల్స్ ఉన్నాయి. మిడ్‌క్యాప్స్ లో అరవింద్ స్మార్ట్‌స్పేసెస్, మ్యాక్స్ రియాల్టీ, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ ఉన్నాయి.ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అనేక భారీ లాంచ్‌లు జరగనున్నాయని అంచనా. ముఖ్యంగా Q3, Q4లో హై-టికెట్ ప్రాజెక్టులు మార్కెట్‌లోకి వస్తే, రియల్ ఎస్టేట్ రంగానికి మరింత వేగం లభించనుంది. పెట్టుబడిదారుల కోసం ఇది మంచి సమయం అని, సరైన కంపెనీలను ఎంచుకుంటే మంచి రాబడులు సాధించవచ్చని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News