HomeTop StoriesBudget 5g smartphone: ఏంది సామీ ఈ ఆఫర్? పాత ఫోన్ ఇస్తే ఫ్రీగా ఇచ్చేలా...

Budget 5g smartphone: ఏంది సామీ ఈ ఆఫర్? పాత ఫోన్ ఇస్తే ఫ్రీగా ఇచ్చేలా ఉన్నాడే.. రియల్‌మీ దెబ్బకు మైండ్ బ్లాక్

Budget 5g smartphone: బడ్జెట్ సెగ్మెంట్‌లో 5జి ఫోన్ కావాలి అనుకునే వాళ్లకు రియల్ మీ తీసుకొచ్చిన రియల్‌మీ నార్జో 80 లైట్ 5జి మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. రోజువారీ యూజ్‌కు సరిపడే ఫీచర్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్, అప్‌డేటెడ్ లుక్ అన్నీ కలిపి ఈ మోడల్ మిడ్ రేంజ్ యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం అమెజాన్ ‌లో ఈ ఫోన్‌పై ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు… ఈ ఫోన్‌పై ఎంత ఆఫర్ ఉంది, ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం పదండి.

- Advertisement -

అప్‌డేటెడ్ లుక్ తో స్లిమ్ డిజైన్

ఈ ఫోన్ కేవలం 7.94ఎంఎం మందంతో స్లిమ్ ఫీల్ ఇస్తుంది. చేతిలో పట్టుకుంటే లైట్ వెయిట్ అనుభూతి వస్తుంది. ముందు భాగంలో పంచ్ హోల్ డిస్‌ప్లే ఉంటుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్ స్పీడ్ స్మూత్‌గా కనిపిస్తుంది. సోషల్ మీడియా బ్రౌజింగ్, వీడియోలు చూడడం లాంటి రోజువారీ యూజ్‌లో డిస్‌ప్లే క్లారిటీ తగినంతగా ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో 120హెచ్‌జెడ్ రావడం నిజంగా ప్లస్.

6000ఎంఏహెచ్ బ్యాటరీ అంటే ఇదే రియల్ స్ట్రెంత్

ఈ నార్జో 80 లైట్ 5జి లో హైలైట్ ఫీచర్ 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో రోజు పైగా ఈజీగా నడుస్తుంది. కాల్స్, వాట్సాప్, యూట్యూబ్, రీల్స్ చూస్తున్నా బ్యాటరీ త్వరగా తగ్గిపోదు. బయట ఎక్కువసేపు ఉండే వాళ్లు, ట్రావెల్ చేసే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం చాలావరకు తగ్గిపోతుంది.

డైమెన్సిటీ 6300 5జి పర్‌ఫార్మెన్స్

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జి ప్రాసెసర్ ఇచ్చారు. డైలీ యాప్ ఓపెనింగ్, మల్టీటాస్కింగ్, లైట్ గేమింగ్ లాంటివి నార్మల్‌గా హ్యాండిల్ చేస్తుంది. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 సపోర్ట్ ఉండటంతో సాఫ్ట్‌వేర్ ఫీల్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. స్టోరేజ్ తగినంతగా ఉండటంతో ఫోటోలు, వీడియోలు సేవ్ చేసుకోవడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఓవరాల్‌గా డైలీ యూజ్‌కు పర్‌ఫార్మెన్స్ సాటిస్‌ఫైయింగ్‌గా ఉంటుంది.

Read Also: Bank Holidays: వీకెండ్ షాక్… 2 రోజులు బ్యాంకులు మూసివేత! ఉద్యోగులకు టెన్షన్?

32ఎంపి కెమెరా సెటప్

వెనక భాగంలో 32ఎంపి రియర్ కెమెరా ఉంది. డే లైట్‌లో ఫోటోలు క్లియర్‌గా వస్తాయి. సోషల్ మీడియా పోస్టులకు సరిపడా డీటెయిల్ కనిపిస్తుంది. ముందు వైపు 8ఎంపి సెల్ఫీ కెమెరా ఇచ్చారు. వీడియో కాల్స్, సాధారణ సెల్ఫీలకు ఇది ఓకే అవుట్‌పుట్ ఇస్తుంది. ఫ్లికర్ లెన్స్ సపోర్ట్ కూడా ఉంది.

ఐపి64 ప్రొటెక్షన్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ

ఈ ఫోన్‌కి ఐపి64 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. చిన్న నీటి చుక్కలు, దుమ్ము వల్ల పెద్దగా సమస్య రాదు. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ టెస్టింగ్ చేసినట్టు కంపెనీ చెబుతోంది. రోజువారీ వాడకంలో చిన్న జారిపడటం లాంటి సందర్భాల్లో వెంటనే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.

అమెజాన్ ఆఫర్ డీటైల్స్

ఇప్పుడు అసలు విషయానికి వస్తే… ప్రస్తుతం అమేజాన్‌లో ఈ రియల్‌మీ నార్జో 80 లైట్ 5జి అసలు ధర 13,999 నుంచి 25 శాతం తగ్గింపుతో కేవలం 10,498 రూపాయలకే అందుబాటులో ఉంది. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. నెలకు సుమారు 369 రూపాయల నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా 9,950 రూపాయల వరకూ సేవింగ్ చూపిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డ్స్‌పై క్యాష్‌బ్యాక్ కూడా వస్తోంది. ఫ్రీ డెలివరీ 4 నుంచి 7 మార్చ్ మధ్యలో ఉంటుంది.

ఎవరికీ ఈ ఫోన్ సరిపోతుంది

బడ్జెట్‌లో 5జి ఫోన్ కావాలి, బ్యాటరీ లైఫ్ ముఖ్యం, రోజువారీ యూజ్‌కు స్మూత్ పర్‌ఫార్మెన్స్ కావాలి అనుకునే వాళ్లకు రియల్‌మీ నార్జో 80 లైట్ 5జి మంచి ఛాయిస్. ముఖ్యంగా అమేజాన్ ఆఫర్‌లో తీసుకుంటే డబ్బు కూడా సేవ్ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News