Friday, December 12, 2025
Homeబిజినెస్Bajaj Chetak: అమ్మకాల్లో దుమ్ము రేపిన బజాజ్‌ చేతక్‌ ఈవీ.. కేవలం మూడేళ్లలో 5.10 లక్షల...

Bajaj Chetak: అమ్మకాల్లో దుమ్ము రేపిన బజాజ్‌ చేతక్‌ ఈవీ.. కేవలం మూడేళ్లలో 5.10 లక్షల విక్రయాలు

Record Sales of Bajaj Chetak EV: దేశీయ ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ కీలక మైలురాయిని దాటింది. రిలీజైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5.10 లక్షల వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. 2020 జనవరిలో విక్రయాలు ప్రారంభించిన చేతక్‌ ఈవీ.. కేవలం మూడేళ్లలోనే 5,10,000 వాహనాల అమ్మకాలు జరిపి అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ మొత్తం అమ్మకాల్లో 2.06 లక్షల యూనిట్లు గత 10 నెలల్లోనే విక్రయించినట్లుగా కంపెనీ తెలిపింది. 2023 నవంబర్‌లో కంపెనీ లక్ష యూనిట్ల మార్కును దాటింది. రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్‌ సంక్షోభం కారణంగా కంపెనీ ఉత్పత్తి కొంతకాలం నిలిచిపోయినప్పటికీ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల జాబితాలో చేతక్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉత్పత్తి తిరిగి ప్రారంభమైనందున అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 3,800కిపైగా సర్వీస్‌ టచ్‌పాయింట్ల నెట్‌వర్క్‌ ఉండడం, విభిన్న వేరియంట్లో మోడళ్లను అందుబాటులోకి తేవడం చేతక్‌ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం బజాజ్‌ చేతక్‌ నుంచి మార్కెట్‌లో 3001, 3501, 3502, 3503 వంటి నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3 kWh, 3.5 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ నాలుగు వేరియంట్ల ధర రూ.99,900 (ఎక్స్‌-షోరూం) నుంచి ప్రారంభమవుతుంది.

- Advertisement -

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 150 కి.మీ మైలేజీ..

బజాజ్‌ చేతక్‌ ఈవీ స్కూటీలో అద్భుతమైన ఫీచర్లు చేర్చింది. ఈ కొత్త చేతక్ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే ఫుల్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చు. అనగా కేవలం 3 గంటల్లోనే 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అందుకు అనుగుణంగా ఈ మూడు వేరియంట్ స్కూటర్లలో మూడు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. అందువల్ల ప్రతి వేరియంట్ యొక్క మైలేజ్ భిన్నంగా ఉంటుంది. ప్రాక్టికల్‌గా 125 కి.మీ మైలేజీ కచ్చితంగా వస్తుంది. చాలా ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఛార్జింగ్‌ సమస్య ఉంటుంది. కానీ, బజాజ్ ఈవీలో ఛార్జింగ్ సమస్య వచ్చే అవకాశం లేదని గట్టిగా చెబుతోంది.

Also Read: https://teluguprabha.net/business/record-sales-of-bajaj-chetak-ev/

చేతక్ ఈవీ ప్రత్యేకతలివే..

బజాజ్‌ చేతక్‌ ఈవీ టచ్ స్క్రీన్ TFT డిస్ ప్లేను కలిగి ఉంటుంది. దీన్ని స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది రైడింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. దీనిలో నావిగేషన్, కాల్ యాక్సెప్టెన్స్ ఆండ్ రిజెక్షన్, మ్యూజిక్, డాక్యుమెంట్ స్టోరేజ్, జియో-ఫెన్సింగ్, థెఫ్ట్ అలర్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్, ఓవర్ స్పీడ్ అలర్ట్‌తో సహా పదుల సంఖ్యలో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక, ధర విషయానికి వస్తే.. కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3501 మోడల్ రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). చేతక్ 3502 మోడల్ 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News