Reliance Jio: యూజర్లకు రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్ ని తొలగించిందని వస్తున్న వార్తలను రిలయన్స్ జియో ఖండించింది. ఎప్పటిలానే రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జి చేసుకోవచ్చని పేర్కొంది. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్‌ను తొలగించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. జియో వెబ్‌సైట్‌తో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ ప్లాన్‌తో రీఛార్జి చేసుకోవచ్చని వెల్లడించింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా అందుబాటు ధరలో రీఛార్జి ప్లాన్లను అందించేందుకు జియో కట్టుబడి ఉందని పేర్కొంది. ఈ ప్లాన్‌తో రీఛార్జిపై 84 రోజుల పాటు 1.5 జీబీ/డే డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తున్నాయి.
Read Also: Asia Cup 2025: కెప్టెన్సీ రేసులో ఉన్న అతడికే జట్టులో చోటు లేదా?
ఇకపోతే, ఇటీవలే జియో రూ.249 ప్లాన్‌ను తొలగించింది. అయితే, ఆ ప్రకటన వెలువడిన మరుసటిరోజే రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపివేస్తున్నట్లు పుకార్లు జోరందుకున్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కావాలనుకుంటే ఇకపై రూ.889తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని కథనాలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను జియో ఖండించింది. ఇకపోతే, రూ.799 ప్లాన్ కాకుండా యూజర్లు రూ.666 ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 70 రోజులపాటు రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇందులో భాగంగా జియో హాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే, 1.5జీబీ ప్లాన్లకు 5జీ సదుపాయం ఉండదు. ఈ విషయాన్ని యూజర్లు గమనించుకోవాలి. గతేడాది నుంచి రోజుకు 2GB డేటా అందించే ప్లాన్లకు మాత్రమే 5జీ సదుపాయాన్ని జియో అందిస్తోంది. మరోవైపు ఎయిర్‌టెల్ కూడా రూ.249 ప్లాన్‌ను నిలిపివేసింది.
Read Also: ICC ODI: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్, కోహ్లీ స్థానాలు మిస్సింగ్స్..!


