Reliance Jio: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు నియంత్రణ సంస్థ ట్రాయ్ షాకిచ్చింది. టారిఫ్ విధానాలతో పాటు పారదర్శకత నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించిన ట్రాయ్, జియోకు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో జియోకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. టారిఫ్ విధానాలతో పాటు పారదర్శకత నిబంధనలు తప్పకుండ పాటించాల్సిందేని ట్రాయ్‌స్పష్టం చేసింది.
ఏప్రిల్ 14 వరకు గడువు
ఈ ఆదేశాలను పాటించడానికి జియోకు ఏప్రిల్ 14 వరకు గడువు ఇచ్చింది. మింట్ నివేదిక ప్రకారం.. జియో రెండు కీలక ఆదేశాలను పాటించట్లేదని ట్రాయ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. కంపెనీ తన అన్ని ప్లాట్‌ఫామ్‌లలో టారిఫ్ ప్లాన్‌లను ఒకే విధంగా చూపాలని పేర్కొంది. కంపెనీ తన యాప్, వెబ్‌సైట్, స్టోర్‌లలో ఒకే రకమైన రీఛార్జ్ ప్లాన్‌లు, ధరలను చూపించాలి సూచించింది.
తప్పుదోవ పట్టించేలా..
వేరు వేరు ప్లాట్‌ఫారమ్‌లలో హైడ్ చేయడం, వేర్వేరు ప్లాన్‌లతో కస్టమర్లను గందరగోళానికి గురిచేసేలా లేదా తప్పుదోవ పట్టించేలా ధరలు ఉండకూడదు ఆదేశించింది. అదే విధంగా కొన్ని ఆఫర్లను డివైజ్‌ను బట్టి మార్చొద్దని తెలిపింది. కొన్ని ప్లాన్‌లు కేవలం కొన్ని ఫోన్‌లు లేదా పరికరాలకు మాత్రమే పరిమితం కాకూడదని, ఏ విధమైన ప్లాన్ అయినా కేవలం ఎంపిక చేసిన ఫోన్‌లలోనే కాకుండా ఇతర ఫోన్‌లోనైనా పనిచేయాలని ట్రాయ్ వెల్లడించింది. అయితే ట్రాయ్ ఉత్తర్వులో స్పందించిన జియో.. దీనికి సంబంధించి అన్ని నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తున్నామని వివరణ ఇచ్చినట్టు సమాచారం.

