Saturday, November 15, 2025
HomeTop StoriesJio prepaid offers: జియో యూజర్లు ఎగిరి గంతేసే వార్త.. తక్కువ ధరకే కొత్తగా 6...

Jio prepaid offers: జియో యూజర్లు ఎగిరి గంతేసే వార్త.. తక్కువ ధరకే కొత్తగా 6 ప్లాన్లు.. అదిరే బెనిఫిట్స్..!

Reliance Jio prepaid New Plans Reacharge Now: భారత టెలికాం మార్కెట్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో.. తాజాగా మరో ఆరు సరసమైన సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.189 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్లాన్లు వాయిస్ కాల్స్‌ నుంచి మొదలుకొని డేటా, లాంగ్ వ్యాలిడిటీ, డిజిటల్ ప్రయోజనాలను అందిస్తోంది. కనెక్టివిటీతో పాటు జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌, గూగుల్‌ జెమినీ ప్రో యాక్సెస్‌ అందించనున్నట్లు జియో వెల్లడించింది. ఏఐ, క్లౌడ్ ఆధారిత సేవలను మొబైల్ రంగానికి నేరుగా అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 2025 ఎడిషనన్స్‌లో భాగంగా జియో అందుబాటులోకి తీసుకొచ్చిన చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

రూ. 189

రూ. 189 ప్లాన్ జియో చీప్ ప్లాన్. ఈ ప్లాన్‌ క్రింద అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 300 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, 2జీబీ డేటాను అందిస్తుంది. 28 రోజుల వరకు వ్యాలిడిటీని అందిస్తుంది. హై స్పీడ్ డేటా పరిమితి అయిపోయిన తర్వాత, నెట్ స్పీడ్ 64 Kbpsకి పడిపోతుంది. ఎంటర్ టైన్ మెంట్, స్టోరేజ్ కోసం వినియోగదారులు జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్‌కి యాక్సెస్ లభిస్తుంది.

రూ. 799

ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, రోజుకు 1.5 జీబీ డేటా లాంటి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత నెట్ స్పీడ్‌ 64 Kbpsకి తగ్గించబడుతుంది. ఇది జియోటీవీ, జియో ఏఐక్లౌడ్ యాక్సెస్‌ లభిస్తుంది.

రూ. 355 ప్లాన్
రూ. 355 ఫ్రీడమ్ ప్లాన్ అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, 30 రోజుల వ్యాలిడిటీ, 25GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ జియో స్పెషల్ ఆఫర్ ప్రోగ్రామ్ కిందికి వస్తుంది. అదనపు డిజిటల్ ప్రోత్సాహకాలను అందిస్తుంది. కొత్త వినియోగదారులకు జియోహోమ్ 2 నెలల ఉచిత ట్రయల్ లభిస్తుంది. 3 నెలలకు జియో హాట్‌ స్టార్ మొబైల్/టీవీ సబ్‌ స్క్రిప్షన్ లభిస్తుంది. ఉచిత 50 జీబీ జియోఏఐక్లౌడ్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్ జెమిని ఆఫర్ లభిస్తోంది.

జియో రూ. 448

రూ. 448 ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌ క్రింద అపరిమిత వాయిస్, 1,000 ఎస్‌ఎమ్‌ఎస్‌, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌ యాక్సెస్ లభిస్తుంది.

రూ. 1748 ప్లాన్

జియో రూ. 1,748 ప్లాన్ ఏడాది వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత వాయిస్, 3,600 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌ ఆప్షన్లతో వస్తుంది.

రూ. 198 ప్లాన్

ఈ సరసమైన స్వల్పకాలిక ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది. ఇది 14 రోజుల వరకు వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad