Jio Offers: వార్షికోత్సవ వేళ రిలయన్స్ జియో యూజర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. 9వ వార్షికోత్సవం సందర్భంగా తమ యూజర్ల గురించి కీలక ప్రకటన చేసింది. తమ నెట్‌వర్క్ వినియోగదారుల సంఖ్య 50 కోట్ల మార్క్ దాటినట్లు తెలిపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే ఆ సంస్థ ప్రత్యేక ఆఫర్స్ ఇచ్చింది. ప్రస్తుత ప్లాన్ ఆధారంగా యూజర్లు అందరికీ అపరిమిత డేటాను నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తామని తెలిపింది. రూ. 349 ఆపైన ప్లాన్లు రీఛార్జ్ చేసుకున్న వారికి సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే వార్షికోత్సవ వారంత ఆఫర్ సైతం తీసుకొచ్చింది. వీకెండ్ ఆఫర్‌లో భాగంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అంటే శుక్రవారం, శనివారం, ఆదివారాలు ప్రస్తుత ప్లాన్లతో సంబంధం లేకుండానే 5జీ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న వారందరికీ ఉచితంగా అన్‌లిమిడెట్ 5జీ డేటా అందిస్తామని జియో తెలిపింది. అలాగే 4జీ యూజర్లు రూ. 39తో రీఛార్జ్ చేసుకోవాలని, ఈ ప్లాన్ ద్వారా ఈ వీకెండ్‌లో అపరిమిత 4జీ డేటాను (రోజుకు గరిష్ఠంగా 3జీబీ) వాడుకోవచ్చని పేర్కొంది. 3జీబీ వరకు గరిష్ఠ వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. ఆ తర్వాత స్పీడ్ తగ్గి లభిస్తుంది.
Read Also: Pakistan: వరస్ట్ ఫీల్డింగ్.. పాక్ ఖాతాలో మరో చెత్త రికార్డు..!
మంత్లీ ఆఫర్
వార్షికోత్సవ నెల ఆఫర్ రూ. 349 ప్లాన్ ప్రకటించింది. రోజుకు 2జీబీ అంత కంటే ఎక్కువ డేటా ఉన్న ప్లాన్ ఉన్న వారికి సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వచ్చే నెల అక్టోబర్ 5వ తేదీ వరకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. అంటే ప్లాన్‌తో సంబంధం లేకుండా రూ. 349 పైన ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా ఈ ఆఫర్ పొందవచ్చు. వీటితో పాటుగా జియో హోమ్ 2 నెలల ఫ్రీ ట్రయల్ సైతం లభిస్తుంది. రూ. 349 ప్లాన్ 12 నెలల పాటు వరుసగా రీఛార్జ్ చేసుకుంటే మరో నెల రోజులు ఉచితంగా సేవలందిస్తామని జియో బంపర్ ఆఫర్ ఇచ్చింది.
Read Also: Duleep Trophy 2025: ఈసారి ప్రత్యేకంగా దులీప్ ట్రోఫీ.. బరిలో స్టార్లు..!
50 కోట్ల మంది కస్టమర్లు
రిలయన్స్ జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడారు. ‘జియో తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా 50 కోట్ల మంది కస్టమర్లు తమపై నమ్మకాన్ని కలిగి ఉండడం గౌరవంగా భావిస్తున్నా. ఈ స్థాయికి చేరుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో జియో ఎలా ఒక భాగమైందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ మైలురాయిని చేరుకున్న క్రమంలో ప్రతి ఒక్క వినియోగదారుడికి వ్యక్తిగతంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.


