Homeబిజినెస్Renault:రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. కేవలం రూ. 4.53 లక్షలకే కళ్లు చెదిరే ఫీచర్లు

Renault:రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. కేవలం రూ. 4.53 లక్షలకే కళ్లు చెదిరే ఫీచర్లు

Renault Kwid Facelift Launch: రెనాల్ట్ కంపెనీ కారు ప్రియులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రెనాల్ట్‌ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ వాహనాన్ని భారత మార్కెట్‌లోకి అతి తక్కువ ధరకే లాంచ్‌ చేసింది. కేవలం రూ. 4.53 లక్షల ప్రారంభ ధర వద్ద దీన్ని విడుదల చేసింది. ఈ మోడల్‌ను మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు 1.0 లీటర్ 3 సిలిండర్ నేచురల్ యాస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. డిజైన్ విషయానికి వస్తే.. దీనిలో చాలా తక్కువ మార్పులు ఉన్నాయి. దీని అవుటర్‌ బాడీలో ఎలాంటి మార్పులు చేయలేదు. క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ వేరియంట్‌లో కొన్ని కొత్త ఫీచర్లు, నూతన టెక్నాలజీని చేర్చింది. ఇవి కారు ప్రియులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కొత్త మోడల్‌ కొత్త కలర్‌ వేరియంట్లు, డిజైన్లలో అందుబాటులోకి వచ్చింది. యూజర్లు ఈ మోడల్‌ను కొనుగోలు చేసే క్రమంలో, వారు కొత్త ఫీచర్లతో కూడిన కారును ఎక్స్‌పీరియన్స్‌ చేయవచ్చు.

- Advertisement -

Also Read: Couple commits suicide: ఘట్‌కేసర్‌లో తీవ్ర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

యువత, చిన్న కుటుంబాలే లక్ష్యంగా..

కొత్త రెనాల్ట్‌ క్విడ్‌ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. క్విడ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌, ఫీచర్లు కారు ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇది యువత, చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. క్విడ్ ఫేస్‌లిఫ్ట్ లాంచింగ్‌ ద్వారా రెనాల్ట్ భారత మార్కెట్‌లో తన మార్కెట్ వాటాను పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ కొత్త మోడల్ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించింది. క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ప్రత్యేకతలు, ప్రయోజనాలను బట్టి చూస్తే.. ఇది మార్కెట్లో బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News