Royal Enfield Himalayan Electric Bike: రాయల్ ఎన్ఫీల్డ్ తన హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్‌ను చాలా కాలంగా పరీక్షిస్తోంది. ప్రత్యేకత ఏమిటంటే? కంపెనీ ఈ అడ్వెంచర్ బైక్‌ను పర్వత భూభాగంలో, ముఖ్యంగా లడఖ్ వంటి కఠినమైన రోడ్లపై పరీక్షిస్తోంది. గతంలో కంపెనీ ప్రీ-ప్రొడక్షన్ మోడల్ కొన్ని చిత్రాలను పంచుకుంది. అయితే, ఇప్పుడు కొత్త ఇమేజ్ లు బైక్ గురించి మరింత సమాచారాన్ని వెల్లడించాయి. ఈ ఫోటోలు రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క అధికారిక రైడ్ ఈవెంట్ నుండి లీక్ అయ్యాయని చెబుతున్నారు.
కొత్త ఇ-హిమాలయన్‌లో అతిపెద్ద మార్పు దాని పూర్తి-ఎలక్ట్రిక్ సెటప్. తాజా ఇమేజ్ లలో బైక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, పొడవైన విండ్‌స్క్రీన్, బ్లాక్-సిల్వర్ సైడ్ ప్యానెల్, కొత్త ఎల్ఈడీ ఇండికేటర్లతో కనిపించింది. దీనికి పొడవైన సింగిల్-పీస్ సీటు, వెనుక లగేజ్ రాక్, గోల్డెన్ స్పోక్ వీల్స్, డ్యూయల్-పర్పస్ టైర్లు ఉన్నాయి. బ్యాటరీ ప్యాక్ ఇంజిన్ ప్రాంతంలో ఇన్‌స్టాల్ చేస్తారు.
also Read: Realme P4 5G: 7000mAh బ్యాటరీతో రియల్‌మీ పీ4 5జీ .. ఈరోజు నుంచే సేల్స్..
రాయల్ ఎన్ఫీల్డ్ తన హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్ రెండు బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి. మోటారు దాదాపు 100bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇక హార్డ్‌వేర్ గురించి మాట్లాడితే, బైక్‌లో యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనో-షాక్, డిస్క్ బ్రేక్‌లు, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే? దీనికి జెన్ (సిటీ), ఆఫ్-రోడ్, టూర్, ర్యాలీ అనే నాలుగు వేర్వేరు రైడ్ మోడ్‌లను పొందుతుంది. దీనికి 14 kWh బ్యాటరీ ప్యాక్ తో పాటు ఆన్-బోర్డ్ ఛార్జర్‌తో అందించనున్నారు.
ఖచ్చితమైన వివరాలు తెలియకపోయినా, మునుపటి నివేదిక ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమ్-ఇ 14 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 74.5 kW (100 hp) ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడుతుంది. ఇది బ్రాండ్‌కు అత్యంత శక్తివంతమైన మోటార్‌సైకిల్‌గా మారుతుంది. దీని పరిధి 200-250 కి.మీ ఉంటుందని అంచనా. ఇది లాంచ్‌కు సిద్ధమవుతుందని కూడా చెబుతున్నారు. రాబోయే ఈ-బైక్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


