Royal Enfield Hunter 350 New Colour Launched: ఇండియాలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జెండర్ తో సంబంధం లేకుండా ఈ బైక్స్ ను అందరూ ఇష్టపడుతారు. వీటిని ఎక్కువగా యువకులు కొనుగోలు చేస్తారు. ఆసక్తి చూపిస్తారు. కంపెనీ వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ బైక్స్ ను కొత్త మార్పులతో తీసుకువస్తాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ తయారుదారి 350 సిసి విభాగంలో అందించే హంటర్ 350, కొత్త రంగుతో మార్కెట్లోకి విడుదల చేసింది.
తయారీదారు హంటర్ 350ని గ్రాఫైట్ గ్రే రంగులో విడుదల చేసింది. దీనితో పాటు, నియాన్ ఎల్లో కలర్ ఇన్సర్ట్‌లు కూడా ఇందులో ఇచ్చారు. కొత్త రంగు ఎంపికలో విడుదల చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 ధర రూ. 1.76 లక్షల ఎక్స్-షోరూమ్. దీని కోసం బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల వినియోగదారులు తమ ఆర్డర్లను ఇవ్వడానికి సమీపంలోని డీలర్‌షిప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Also read: Top 100cc Bikes: బైక్ కొనాలా ..? చౌకైన 100సీసీ బైక్‌లు..
రాయల్ ఎన్ ఫీల్డ్ నుండి వచ్చిన కొత్త రంగుతో పాటు, ఈ బైక్ ఏడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. వీటిలో గ్రాఫైట్ గ్రే రంగు మిడ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. మిడ్ వేరియంట్ లో, ఈ బైక్ కొత్త రంగుతో పాటు రియో వైట్, డాపర్ గ్రే రంగులలో అందుబాటులో ఉంచబడింది.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో 349 సిసి సింగిల్-సిలిండర్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ J-సిరీస్ ఇంజిన్‌ను అందిస్తుంది. ఇది బైక్‌కు 20 PS పవర్, 27 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్ తో ఈ బైక్ కు ఐదు-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఇచ్చారు. తయారీదారు ఈ బైక్ లో LED హెడ్ లైట్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, SMS, కాల్ అలర్ట్ లు, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్ ఛానల్ ABS, 160 mm గ్రౌండ్ క్లియరెన్స్, సింగిల్ సీట్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ వంటి ఫీచర్లను అందించారు.


