Royal Enfield Bikes Record Sales: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త బైక్ కొంటె ఎన్ ఫీల్డ్ బైక్ మాత్రమే కొనాలని అని అనుకునే వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఈ బైక్స్ కు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. దీంతో సేల్స్ పెరుగుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2025 పండుగ సీజన్‌ను కొత్త రికార్డుతో ముగించింది. కంపెనీ సెప్టెంబర్, అక్టోబర్ 2025లో మొత్తం 249,279 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. పోయిన ఏడాది ఇదే సమాయంతో పోలిస్తే, ఇది 26 శాతం గణనీయమైన పెరుగుదల! జీఎస్టీ తగ్గింపు కారణంగా మోటార్‌సైకిల్ ధరలు తగ్గడం అమ్మకాల పెరుగుదలకు అతిపెద్ద కారణం అని చెప్పవచ్చు. జీఎస్టీ తగ్గింపు బుల్లెట్ 350, క్లాసిక్ 350తో సహా అనేక రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లను చౌకగా చేసింది. పండుగ సీజన్ అమ్మకాలను పెంచడంలో కీలక పాత్ర పోషించింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బలమైన అమ్మకాల పెరుగుదల
అక్టోబర్ 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం అమ్మకాలు 124,951 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే, 13 శాతం వార్షిక పెరుగుదల! అక్టోబర్‌లో కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 116,844 యూనిట్లను విక్రయించింది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే, 15 శాతం ఎక్కువ. దీని ఎగుమతులు స్వల్పంగా తగ్గినప్పటికీ, 8,107 యూనిట్లు ఇప్పటికీ విదేశాలకు రవాణా చేసింది.
ఆర్థిక సంవత్సరం (FY2026) కోసం, కంపెనీ ఇప్పటివరకు 716,854 యూనిట్లను పంపించింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం (FY2025) తో పోలిస్తే 27 శాతం పెరుగుదల. జీఎస్టీ తగ్గింపు కంపెనీ విజయానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు హంటర్ 350, మెటియోర్ 350, క్లాసిక్ 350, బుల్లెట్ 350 వంటి మోడళ్ల ధరలను గణనీయంగా తగ్గించింది. ఇది అమ్మకాలకు గణనీయంగా దోహదపడింది. ధర తగ్గింపు ఈ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిని రేకెత్తించింది.
అమెజాన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుని మోటార్‌సైకిళ్లను ఆన్‌లైన్‌లో విక్రయించింది. కస్టమర్లు ఇప్పుడు అన్ని 350cc మోటార్ సైకిళ్లను అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, పూణేలలోని అమెజాన్ ప్రత్యేక బ్రాండ్ స్టోర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు తమకు ఇష్టమైన మోటార్ సైకిళ్లను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.


