Rupee strengthens: యుద్ధాల కారణంగా బలహీనపడిన రూపాయి ఇప్పుడు మెరుగవుతోంది. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ గత మూడు రోజులుగా బలపడింది. విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన ఫారెక్స్ ఫండ్ల ప్రభావంతో భారత రూపాయి స్ట్రాంగ్ అవుతోంది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 23 పైసలు మెరుగుపడి 85.49 స్థాయిని చేరకుకుంది. ఈ మారకం విలువను ఎక్స్ఛేంజ్ రేటు అంటారు. ఉదాహరణకు, క్రితం రోజు ఒక డాలర్ కొనడానికి ₹85.72 అవసరమైతే, ఈ రోజు అది ₹85.49కి తగ్గింది. దీని వల్ల విదేశీ వస్తువుల దిగుమతులు, విదేశీ ప్రయాణాలు, అంతర్జాతీయ విద్య వంటి సేవలు భారతీయులకు కొంత చౌకగా మారతాయి.
ప్రధానంగా విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లలో డబ్బు పెట్టడం వల్ల, వారు అమెరికన్ డాలర్లను రూపాయిలోకి మారుస్తుండటంతో భారత కరెన్సీ డిమాండ్ పెరిగింది
అలాగే దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల వాతావరణం, పెట్టుబడులకు అనుకూలమైన ఆర్థిక సూచనలు కూడా రూపాయి బలపడటానికి తోడ్పడ్డాయి. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా డాలర్ బలంగా ఉండటం రూపాయి లాభాలను కొంతమేర తగ్గించే అంశాలుగా ఉన్నాయి.
దీంతోపాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా అవసరమైతే మార్కెట్‌లో జోక్యం చేసుకునే అవకాశం ఉంది, తద్వారా రూపాయి నియంత్రణలో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
విదేశీ పెట్టుబడుల ప్రవాహం
విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ముఖ్యంగా ఫారెక్స్ ఫండ్స్ కారణంగా రూపాయి బలపడుతోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వారు డాలర్లను రూపాయిలోకి మార్చుకోవాల్సి వస్తుంది, దీనివల్ల ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయికి డిమాండ్ పెరుగుతుంది.
ఈ పెట్టుబడులు రెండు రకాలుగా..
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) అంటే దీర్ఘకాలిక, స్థిరమైన పెట్టుబడి, మరొకటి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడి (FPI) స్వల్పకాలిక, ఎక్కువ లాభాల కోసం చేసే పెట్టుబడిగా చెప్తారు.
ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న ప్రవాహాలు ఎక్కువగా FPIల రూపంలో ఉండగా, ఇవి స్టాక్ మార్కెట్లలో షేర్లు, బాండ్లు వంటి సెక్యూరిటీల కొనుగోలుగా వస్తున్నాయి.
విదేశీ పెట్టుబడుల బలానికితోడు, దేశీయంగా నెలకొన్న పాజిటివ్ మార్కెట్ సెంటిమెంట్ కూడా రూపాయి మెరుగుదలకుకు తోడ్పడింది. పెట్టుబడిదారులు భారత ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకాన్ని వ్యక్తపరిచారు. భారతదేశంలోని స్టాక్ ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ పటిష్టంగా ట్రేడ్ అవుతుండటం దీనికి ఉదాహరణ అని చెప్పొచ్చు.
అయితే, మరోవైపు కొన్ని నెగటివ్ అంశాలు రూపాయి లాభాలను కొంతమేరగా పరిమితం చేస్తున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరల పెరగడం, అవును భారతదేశం ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటుంది. ధరలు పెరిగితే, దేశానికి ఎక్కువ డాలర్లు అవసరమవుతాయి. ఇది డాలర్‌కు డిమాండ్ పెంచి, రూపాయిపై ప్రభావం చూపుతుంది. ఇంకా అమెరికా డాలర్ ఇతర కరెన్సీలతో పోలిస్తే బలంగా ఉండటం కూడా రూపాయి విలువ పెరగడాన్ని నియంత్రిస్తోంది.