Homeబిజినెస్Rupee value: భారీ పతనం.. సెంచరీకి చేరువలో రూపాయి విలువ.. తొలిసారి రూ. 96 తాకిన...

Rupee value: భారీ పతనం.. సెంచరీకి చేరువలో రూపాయి విలువ.. తొలిసారి రూ. 96 తాకిన వాల్యూ

Rupee value nears century mark: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ దారుణంగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ విలువ తొలిసారి రూ.96 మార్కును దాటి సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. ఇదే పతనం కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే రూ. 100 కు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం ట్రేడింగ్‌ సెషన్‌లో 95.96 వద్ద కనిష్ఠాన్ని తాకిన రూపాయి విలువ.. శుక్రవారం మధ్యాహ్నం 96.07 కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో మన రూపాయిపై భారీగా ఒత్తిడి పెరుగుతోంది. రూపాయి విలువ పతనమైతే.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలు, పెట్రోల్‌, నేచురల్‌ గ్యాస్‌, ఎలక్ట్రానిక్స్, బంగారం, లగ్జరీ కార్లు, గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. ఈ ప్రభావంతో నిత్యావసరాల ధరలు కూడా భారీగే పెరిగే అవకాశముంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం తమ పిల్లల్ని పంపిన తల్లిదండ్రులపై మరింత భారం పెరుగుతుంది. అదే సమయంలో మన దేశం నుంచి వస్తువులు, సేవలు ఎగుమతి చేసేవారు మాత్రం మంచి లాభాలు ఆర్జించవచ్చు.

- Advertisement -

Also read: https://teluguprabha.net/telangana/tpcc-cheif-mahesh-goud-comments-on-sir/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News