Saturday, November 15, 2025
Homeబిజినెస్S Jaishankar: ఆ వాదనల్లో లాజిక్ లేదు.. అమెరికాపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు

S Jaishankar: ఆ వాదనల్లో లాజిక్ లేదు.. అమెరికాపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు

S Jaishankar: రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని అమెరికా ఒత్తిడి తెస్తున్న వేళ భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మాస్కో పర్యటన కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జైశంకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోంది. ఈ కారణం వల్లే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) ఇటీవల భారత్‌పై సుంకాలు విధించారు. అయితే, ఈ క్రమంలోనే రష్యా నుంచి చమురు కొనుగోళ్ల వ్యవహారంలో అగ్రరాజ్యం చేస్తున్న వాదనలపై జైశంకర్‌ (Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించేందుకు రష్యా నుంచి చమురు కొనుగోలు సహా అన్ని చర్యలు తీసుకోవాలని అమెరికాకు కొంతకాలంగా చెబుతున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో వాషింగ్టన్ వాదనల వెనుక ఉన్న లాజిక్‌ విషయంలో గందరగోళంగా ఉన్నట్లు చెప్పారు. ‘‘రష్యా (Russia) చమురును భారత్ భారీగా కొనుగోలు చేయట్లేదు. కానీ, చైనా ఆ పని చేస్తోంది. అదేవిధంగా ఎల్ఎన్‌జీని కూడా మేం ఎక్కువగా కొనుగోలు చేయడం లేదు. ఈయూ కూడా రష్టా నుంచి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటోంది. 2022 తర్వాత రష్యాతో అత్యధిక వాణిజ్య వృద్ధి నమోదైన దేశం కూడా భారత్‌ కాదు. కొన్ని దక్షిణ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించేందుకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంతో సహా పలు చర్యలు తీసుకోవాలని కొన్నేళ్లుగా అమెరికా (USA) చెబుతోంది. మేం అగ్రరాజ్యం నుంచి కూడా చమురు కొనుగోలు చేస్తున్నాం. ఆ పరిమాణం కూడా పెరిగింది’’ అని జైశంకర్‌ (S Jaishankar) తెలిపారు.
Read Also:Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్- పాక్ మధ్య పోరుకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -

రష్యా పర్యటనలో..

ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న జైశంకర్‌.. ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ డెనిస్‌ మంటురోవ్‌ సహా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరుదేశాలు నూతన మార్గాలు అన్వేషించి ముందుకుసాగాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్‌లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీంతో, వ్యాపారాన్ని మరింత విస్తృతంగా చేయవచ్చని పేర్కొన్నారు.

Read Also:EV Race Heats Up: హీటెక్కిన ఈవీ రేస్.. తొలిస్థానానికి ఎగబాకిన ఏథర్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad