Homeబిజినెస్Samsung S24 discount: పాత ఫోన్ ఇస్తే ఇంకా తక్కువకే.. సామ్‌సంగ్ S24 పై కళ్లు...

Samsung S24 discount: పాత ఫోన్ ఇస్తే ఇంకా తక్కువకే.. సామ్‌సంగ్ S24 పై కళ్లు చెదిరే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌

Samsung S24 discount: చాలా మందికి కొత్త ఫోన్ కొనాలంటే బడ్జెట్ సాధారణంగా రూ.50,000 చుట్టూ ఉంటుంది. కానీ ఆ ధరలో నిజంగా ఫ్లాగ్‌షిప్ అనిపించే ఫోన్ దొరకడం చాలా అరుదు. మార్కెట్లో అనేక మిడ్ రేంజ్ ఫోన్లు ఉన్నా, పెద్ద డిస్కౌంట్లు లేకపోతే ఫ్లాగ్‌షిప్ మోడల్ తీసుకోవడం కాస్త కష్టమే. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24పై అమెజాన్‌లో భారీ తగ్గింపు రావడంతో ఈ ఫోన్ చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. మొదట రూ.79,999 ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు పెద్ద డీల్‌తో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

- Advertisement -

ధర ఎలా రూ.46,500కి పడింది

అమెజాన్‌లో ప్రస్తుతం సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 ధర రూ.47,499కి తగ్గింది. ఇది లాంచ్ ధరతో పోలిస్తే చాలా పెద్ద తగ్గింపు అని చెప్పాలి. అంతేకాదు బ్యాంక్ కార్డ్ ఆఫర్ ఉపయోగిస్తే అదనంగా రూ.1,000 తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో మొత్తం ధర సుమారు రూ.46,500 వరకు పడిపోతుంది. ఈ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ దొరకడం చాలా అరుదు. అందుకే కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నవారు ఈ ఆఫర్‌ను తప్పకుండా పరిశీలిస్తున్నారు.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో ఇంకా భారీ తగ్గింపు

ఇక్కడితో ఆఫర్లు ముగియవు. అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ దగ్గర ఉన్న పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటే గరిష్టంగా రూ.42,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ విలువ పూర్తిగా మీ పాత ఫోన్ పరిస్థితి, మోడల్, బ్రాండ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సరైన ఫోన్ ఉంటే చాలా తక్కువ ధరలోనే గెలాక్సీ ఎస్24ను పొందే అవకాశం ఉంటుంది.

డిస్‌ప్లే, డిజైన్ ఎలా ఉన్నాయి

ఈ ఫోన్‌లో 6.2 అంగుళాల LTPO AMOLED డిస్ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల బయట సూర్యకాంతిలో కూడా డిస్ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది. స్లిమ్ డిజైన్, అప్‌డేటెడ్ లుక్ వల్ల ఈ ఫోన్ చేతిలో చాలా ప్రీమియం అనిపిస్తుంది. చిన్న సైజ్‌లో స్టైలిష్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది.

పర్‌ఫార్మెన్స్, బ్యాటరీ

పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ ఇచ్చారు. ఇది రోజువారీ వినియోగం, మల్టీటాస్కింగ్, గేమింగ్ లాంటి పనులను స్మూత్‌గా నిర్వహించగలదు. ఇందులో 8GB RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. బ్యాటరీ విషయంలో 4000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఇచ్చారు. దీంతో రోజంతా ఉపయోగించినా బ్యాటరీ బ్యాకప్ తగినంతగా ఉంటుంది. అలాగే 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

కెమెరా, AI ఫీచర్లు

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50MP ప్రధాన కెమెరా ఉంటుంది. అదనంగా 10MP టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే 12MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అంతేకాదు ఈ ఫోన్‌లో గెలాక్సీ AI ఫీచర్లు కూడా అందించారు. సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, చాట్ అసిస్ట్, జనరేటివ్ ఎడిట్ లాంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా IP68 రేటింగ్ ఉండటం వల్ల నీరు, దుమ్ము నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News