Muhurat Trading 2025: సంవత్ 2082 హిందూ కాలగణన ప్రకారం వచ్చే కొత్త సంవత్సరం. ఇది చాంద్రమాన ప్రాతిపదపై ఆధారపడిన భారతీయ పంచాంగంలో ప్రత్యేకమైన స్థానం కలిగిన సంవత్సరం. ప్రతి సంవత్ సంవత్సరం ఒక నూతన శకం మొదలయినట్లే భావించబడుతుంది. భారతీయ ధార్మిక, సాంస్కృతిక, సామాజిక జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది. సంవత్ 2082ను “క్రౌఢ నామ సంవత్సరము”గా పిలుస్తున్నారు. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమైందిగా పంచాంగ రచయితలు పేర్కొన్నారు.
సంవత్ ట్రేడింగ్ అనేది భారతీయ స్టాక్ మార్కెట్‌లో ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్. ఇది దీపావళి పండుగ రోజు జరగుతుంది. హిందూ కొత్త సంవత్సరం ప్రారంభానికి సూచికగా ఉంటుంది. ఈ రోజును “ముహురత్ ట్రేడింగ్” అని కూడా పిలుస్తారు.
సంవత్ 2082 ప్రారంభానికి గాను ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ జర్నీకి శుభారంభం చేయాలనే ఉద్దేశంతో ఈ ముహురత్ ట్రేడింగ్ సెషన్‌లో పాల్గొంటుంటారు. ఇది సాధారణంగా ఒక గంట పాటు మాత్రమే జరుగుతుంది. దీనిని శుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లు చిన్న మొత్తంలో అయినా షేర్లను కొనుగోలు చేస్తూ ఆర్థిక ప్రగతికి శంకుస్థాపన చేస్తారు. ఈ ఏడాది సంవత్ అంటే కొత్త సంవత్సరం సందర్భంగా నిర్వహించే ముహురత్ ట్రేడింగ్ అక్టోబర్ 21న నిర్వహించబడుతోంది. ఈసారి ప్రతిసారి లాగా సాయంత్రం కాకుండా మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు.
సంవత్ ట్రేడింగ్ కోసం నిపుణులు సూచించిన స్టాక్స్..
దేశీయ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఏంజల్ వన్ దీపావళి 2025 ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కోసం కొన్ని స్టాక్స్ ఎంపిక చేసింది.
1. బ్యాంక్ ఆఫ్ బరోడా
2. ఎల్ అండ్ టి
3. సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ
4. టీసీఎస్
5. వేదాంత


