Wednesday, January 14, 2026
Homeబిజినెస్SEBI: బ్యాంక్ ఆఫ్ అమెరికాకు సెబీ షాక్: ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై షోకాజ్ నోటీసులు!

SEBI: బ్యాంక్ ఆఫ్ అమెరికాకు సెబీ షాక్: ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై షోకాజ్ నోటీసులు!

SEBI vs Bank of America: భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI), గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడు దలాల్ స్ట్రీట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందంటూ ఈ విదేశీ బ్యాంకుకు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది.

- Advertisement -

అసలేం జరిగింది?
2024 మార్చిలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన సుమారు 177 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,475 కోట్లు) విలువైన షేర్ల విక్రయ బాధ్యతలను బ్యాంక్ ఆఫ్ అమెరికా చేపట్టింది. ఈ డీల్ ప్రక్రియలో ఉండగానే, షేర్ల ధర మరియు ఇతర అత్యంత రహస్య సమాచారాన్ని బ్యాంకుకు చెందిన డీల్ టీమ్ ముందే బయటకు లీక్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఒక ‘విజిల్ బ్లోయర్’ ఇచ్చిన సమాచారంతో ఈ ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది.

Also Read:Swiggy Report – హైదరాబాదీల ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌గా బిర్యాని..

సెబీ ఆగ్రహానికి కారణాలు:
షేర్ల విక్రయానికి ముందే ఇన్వెస్టర్లకు, ఇతర ఉద్యోగులకు సమాచారాన్ని చేరవేసి మార్కెట్ నియమాలను ఉల్లంఘించడం. ప్రాథమిక విచారణ సమయంలో బ్యాంకు తన అంతర్గత విచారణలో “ఏ తప్పూ జరగలేదు” అని నివేదిక ఇచ్చింది. అయితే సెబీ లోతైన దర్యాప్తులో వాస్తవాలను దాచిపెట్టి, తప్పుడు స్టేట్‌మెంట్లతో దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని తేలింది. పెద్ద డీల్స్ చేసేటప్పుడు పాటించాల్సిన ‘చైనీస్ వాల్’ (సమాచార గోప్యత) నిబంధనను బ్యాంకు విస్మరించినట్లు సెబీ పేర్కొంది.

సెటిల్‌మెంట్ దిశగా అడుగులు?
నవంబర్‌లోనే షోకాజ్ నోటీసులు అందినప్పటికీ, తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆత్మరక్షణలో పడింది. కఠినమైన చర్యలు తప్పవని భావించిన బ్యాంకు, ఈ వివాదాన్ని ‘సెటిల్‌మెంట్’ ద్వారా పరిష్కరించుకోవడానికి సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అంటే, తప్పు ఒప్పుకోకుండానే నిర్ణీత మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించి కేసును ముగించే ప్రయత్నం ఇది.

ఇన్వెస్టర్లపై ప్రభావం:
ఇలాంటి ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఉల్లంఘనలు మార్కెట్ పారదర్శకతను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా పెద్ద బ్యాంకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్ల సామాన్య ఇన్వెస్టర్లు నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సెబీ స్పందన కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News