Homeబిజినెస్Stock Market: ఉదయం లాభాల్లో ప్రారంభమై.. చివరికి నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌..!

Stock Market: ఉదయం లాభాల్లో ప్రారంభమై.. చివరికి నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌..!

Sensex down 135 points: గత కొంత కాలంగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ తీవ్ర ఒత్తిడి లోనయ్యాయి. దీంతో సూచీలు భారీ నష్టాల్లో ముగిషాయి. ఉదయం లాభాల్లో ట్రేడయిన సూచీలు.. చివరికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 135.03 పాయింట్లు నష్టపోయి 75,183.36 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 4.30 పాయింట్ల నష్టంతో 23,654.70 వద్ద స్థిరపడింది. బుధవారం 75,318.39 పాయింట్ల వద్ద ముగిసిన సూచీలు ఉదయం 75,732.42 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో 74,996.78 నుంచి 75,945.79 మధ్య కదలాడింది. చివరికి నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇండిగో, బీఈఎల్, ట్రెంట్‌, అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ 104 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 4518 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కాగా, అమెరికా డాలర్తో పోలిస్తే గత కొంత కాలంగా ఆల్‌టైమ్‌ కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ ఆర్‌బీఐ రంగ ప్రవేశంతో కాస్త బలపడింది. ఆర్‌బీఐ చర్యలతో రూపాయి 63 పైసలు బలపడి 96.23కు చేరుకోవడం కాస్త ఊరటనిచ్చింది.

- Advertisement -

Also read: Hamza Burhan: పాకిస్థాన్‌కు బిగ్‌షాక్‌.. పుల్వామా సూత్రధారి హమ్జా బుర్హాన్ హతం..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News